E-Paper
Advertisement

బ్రెజ్జా vs నెక్సాన్.. బేస్ వేరియంట్‌ లో ఏది బెస్ట్ SUV?

బ్రెజ్జా vs నెక్సాన్.. బేస్ వేరియంట్‌ లో ఏది బెస్ట్ SUV?
Advertisement

Brezza vs Nexon Base Variant Comparison: సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ మంచి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీటి బేస్ పెట్రోల్ వేరియంట్లు సింపుల్‌ గా, అవసరమైన ఫీచర్లతో వస్తాయి. అయితే, ఈ రెండు మోడళ్ల మధ్య కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంజిన్ గురించి..

బ్రెజ్జా 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుంది. ఇది సుమారు 99 bhp పవర్, 137 Nm టార్క్‌ ను ఇస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంటుంది. అదే ఇంజిన్‌ను CNG ఆప్షన్‌ లో కూడా పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు, నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 118 bhp పవర్, 170 Nm టార్క్‌ ను అందిస్తుంది. అంటే, పవర్ పరంగా నెక్సాన్ కాస్త ముందు ఉంటుంది. హైవే డ్రైవింగ్, ఓవర్‌ టేక్‌ కోసంబాగుంటుంది. అయితే సిటీలో సింపుల్ డ్రైవింగ్, మెయింటెనెన్స్ విషయంలో బ్రెజ్జా మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

భద్రతా ఫీచర్ల

Advertisement

రెండు కార్లలో కూడా ABS, EBD, ESC, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. బ్రెజ్జాలో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, పార్కింగ్ సెన్సార్లు, ISOFIX మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెక్సాన్‌ లో కూడా ఇవే ఉన్నా, అదనంగా ప్యాసింజర్ ఎయిర్‌ బ్యాగ్ ఆఫ్ స్విచ్, సీట్‌ బెల్ట్ ప్రీటెన్షనర్లు లాంటి ఫీచర్లు ఉంటాయి. ఇవి భద్రత విషయంలో నెక్సాన్‌ కు కొంచెం అదనపు మెరుగుదలగా చెప్పుకోవచ్చు.

సౌకర్యాలు

రెండు SUVలు కూడా మాన్యువల్ AC, టిల్ట్ స్టీరింగ్ లాంటి బేసిక్ ఫీచర్లను ఇస్తాయి. బ్రెజ్జాలో వెనుక AC వెంట్లు ఉండటం  పెద్ద ప్లస్ పాయింట్. ఇది వెనుక సీటులో కూర్చునే వారికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే రీడింగ్ లైట్స్, ఆర్మ్‌ రెస్ట్ లాంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా అందిస్తారు. నెక్సాన్ మాత్రం ఇంటీరియర్ డిజైన్‌ పై ఎక్కువ దృష్టి పెట్టింది. యాంబియంట్ లైటింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్ లాంటి ఫీచర్లు క్యాబిన్‌కు ప్రీమియం ఫీలింగ్ ఇస్తాయి.

టెక్నాలజీ గురించి..

Advertisement

టెక్నాలజీ విషయంలో కూడా కొంత తేడా ఉంది. రెండు కార్లలోనూ బేస్ వేరియంట్లలో సింపుల్ అనలాగ్ మీటర్ ఉంటుంది. కానీ, నెక్సాన్‌లో కొంత డిజిటల్ డిస్‌ ప్లే కూడా ఉంటుంది. లైటింగ్ విషయంలో నెక్సాన్ ముందుంది. ఇందులో LED హెడ్‌ ల్యాంప్స్, DRLs ఉంటాయి. బ్రెజ్జాలో మాత్రం హాలోజన్ హెడ్‌ ల్యాంప్స్ ఉంటాయి. నెక్సాన్‌లో డ్రైవింగ్ మోడ్స్, యాప్ ఆధారిత యాంటీ థెఫ్ట్ ఫీచర్ వంటి అదనపు టెక్నాలజీలు ఉన్నాయి.

డిజైన్ గురించి..

బ్రెజ్జా సింపుల్, క్లీన్ లుక్‌ తో ఉంటుంది. బాడీ కలర్ బంపర్లు, సాధారణ ఇంటీరియర్ డిజైన్ దీనికి ప్రత్యేకత. నెక్సాన్ మరింత స్టైలిష్‌ గా కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ కలర్స్, స్పోర్టీ డిజైన్, అదనపు డిటైలింగ్ దీనికి రగ్గడ్ లుక్ ఇస్తాయి.

ధర ఎంత అంటే?

బ్రెజ్జా బేస్ వేరియంట్ సుమారు రూ.8.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నెక్సాన్ బేస్ వేరియంట్ మాత్రం సుమారు రూ.7.36 లక్షల నుంచి లభిస్తుంది.  ధరలో నెక్సాన్ కాస్త చవకగా ఉంటుంది.

Read Also: ప్రభుత్వ సబ్సిడీ + బ్యాంక్ లోన్, ఈవీ స్కూటర్ కొనడం చాలా ఈజీ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×