E-Paper
Advertisement

BMW New Logo: బీఎండబ్ల్యూ లవర్స్‌కు క్రేజీ న్యూస్, కొత్త లోగో వచ్చేస్తోంది!

BMW New Logo: బీఎండబ్ల్యూ లవర్స్‌కు క్రేజీ న్యూస్, కొత్త లోగో వచ్చేస్తోంది!
Advertisement

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW లోగో విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2026 నుంచి అన్ని కొత్త మోడళ్లలో దాని ఐకానిక్ లోగోను మార్చబోతోంది. సరికొత్తగా అప్ డేట్ చేసిన లోగోతో కొత్త కార్లు పరిచయం కాబోతున్నాయి. రిఫ్రెష్ చేయబడిన బ్యాడ్జ్ మొదటిసారి గత సంవత్సరం BMW iX3 ఎలక్ట్రిక్ SUVలో కనిపించింది. కానీ, ఇప్పుడు కంపెనీ దాని లైనప్‌ లోని ప్రతి వాహనానికి ఇదే లోగోను తీసుకురావాలని భావిస్తోంది.

BMW కొత్త లోగో ఎలా ఉంటుందంటే?

ఫస్ట్ లుక్ లో BMW లోగోలో మార్పులు లైట్ గా మిస్ అయ్యాయి. అప్ డేట్ చేసిన లోగో బ్లూ, వైట్ కలర్స్ తో కూడిన  పాపులర్ లోగో రౌండ్ డిజైన్‌ లో ఉంటుంది. కానీ, ఇది పాత లోగోలో భాగమైన కొన్ని క్రోమ్ డీటైల్స్ ను తొలగిస్తుంది. ఒకప్పుడు నల్లటి ఔట్ బ్యాండ్‌ ను రంగుల క్వాడ్రంట్ల నుంచి వేరు చేసిన లోపలి క్రోమ్ రింగ్ తొలగించబడింది. బ్లూ, వైట్  విభాగాల చుట్టూ ఉన్న క్రోమ్ అంచు కూడా కనిపించడం లేదు. నిగనిగలాడే ఫినిషింగ్ స్థానంలో, నల్లటి రింగ్ ఇప్పుడు మాట్టే, శాటిన్ లుక్ ను కలిగి ఉంటుంది. ఇది  కార్లకు మరింత లేటెస్ట్ లుక్ ను ఇస్తుంది. అదనంగా, లోగో లోపల రంగులు, ముఖ్యంగా బ్లూ, వైట్, మరింత బ్రైట్ గా కనిపిస్తున్నాయి. BMW అక్షరాలు మునుపటి వెర్షన్‌తో పోలిస్తే కొంచెం సన్నగా కనిపిస్తున్నాయి.

ఎందుకు BMW  లోగోను మార్చిందంటే?  

Advertisement

BMW కొత్త లోగో తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. అయితే, ఎందుకు అనే విషయంలో పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ,  తన బ్రాండ్ కు కొత్త హంగులు అద్దాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ గుర్తింపునకు సరిపోయేలా లోగోను అప్ డేట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.  ఈ మార్పు కంపెనీ గుర్తింపును మరింతగా వినియోగదారులలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఉండబోతోంది. ప్రత్యేకించి ఈ లోగో కొత్త మోడళ్లలో అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్, డిజిటల్ టెక్నాలజీలను స్వీకరించే మోడల్స్ కు ఈ లోగో మరింత ఆకర్షణ తీసుకు వస్తుందని కంపెనీ భావిస్తోంది.

కొత్త మోడళ్లలో రోల్ అవుట్

కొత్తగా రూపొందించిన కంపెనీ బ్యాడ్జ్ ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి చేయబడిన అన్ని కొత్త వాహనాలపై కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది కొత్త కార్ల హుడ్‌లపై ఉంచబడుతుంది. అయితే,  రిఫ్రెష్ చేయబడిన లోగో వాహనం ఇతర భాగాలపై, వీల్ క్యాప్స్, టెయిల్‌ గేట్లు, స్టీరింగ్ వీల్స్ లాంటి వాటిపై  ఉంచుతుందో? లేదో? BMW ధృవీకరించలేదు. అటు ఈ లోగో గురించి బయటకు తెలిసిన నేపథ్యంలో చాలా మంది అభిమానులు, కొనుగోలుదారులు రియాక్ట్ అవుతున్నారు. కొత్త లోగో మరింత ఆధునికంగా కనిపిస్తుందని కొందరు చెప్పారు, మరికొందరు మార్పులు ఒకే సారి చూస్తే అర్థం కావని మరికొంత మంది అంటున్నారు.

Advertisement

Read Also: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×