E-Paper
Advertisement

మరోసారి ధరలు పెంచిన BMW.. ఈసారి ఎంత పెరిగిందంటే?

మరోసారి ధరలు పెంచిన BMW..  ఈసారి ఎంత  పెరిగిందంటే?
Advertisement

BMW India Announces Price Hike: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW గ్రూప్ ఇండియా మరోసారి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి BMW, MINI బ్రాండ్లకు చెందిన కార్ల ధరలు గరిష్టంగా 2 శాతం వరకు పెరగనున్నాయి. ఈ పెంపు స్థానికంగా అసెంబుల్ చేసే వాహనాలతో పాటు విదేశాల నుంచి పూర్తిగా తయారై దిగుమతి చేసుకునే మోడళ్లకు కూడా వర్తించనుంది.

ధరల పెంపు గురించి BMW ఏం చెప్పిందంటే?

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపై పలు ఆర్థిక ఒత్తిడి కొనసాగుతుందని BMW తెలిపింది. ముఖ్యంగా రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ రవాణా ఖర్చులు పెరగడం, దిగుమతి భాగాల వ్యయం పెరగడం వల్లే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో వినియోగదారులపై కొంత అదనపు భారం పడనున్నప్పటికీ, కంపెనీ స్మూత్ గా నడవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

ధరల పెంపు ప్రభావం BMW ఇండియా లైనప్‌లోని పలు ప్రముఖ మోడళ్లపై పడనుంది. దేశంలోనే అసెంబుల్ చేస్తున్న 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, X1 వంటి కార్లు కొత్త ధరలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే M4, M5, i7 వంటి ప్రీమియం మోడళ్ల ధరలు కూడా పెరగనున్నాయి.

BMW గ్రూప్‌ కు చెందిన MINI బ్రాండ్ వాహనాలకు కూడా ఈ పెంపు కొనసాగిస్తుంది. MINI కూపర్, కంట్రీమ్యాన్ లాంటి మోడళ్లకు కూడా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో లగ్జరీ హ్యాచ్‌ బ్యాక్, కాంపాక్ట్ ప్రీమియం SUV కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు జూలైకి ముందు బుకింగ్ చేసుకోవాలని ఆటో నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్స్ అమలు

Advertisement

మరోవైపు ధరల పెంపు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించేందుకు BMW ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్ లను కొనసాగించనున్నట్లు కంపెనీ తెలిపింది. తక్కువ ఈఎంఐలు, మంచి రుణ సదుపాయాలు, అనుకూలమైన ఫైనాన్స్ ఆప్షన్ల ద్వారా వినియోగదారులకు సహాయం చేయాలని సంస్థ భావిస్తోంది.

2026లో రెండోసారి ధరల పెంపు

2026లో BMW ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో కూడా కంపెనీ దాదాపు 2 శాతం వరకు ధరలను పెంచింది. ఆ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్లో కూడా ముడిసరుకు ధరలు పెరగడం, రవాణా వ్యయాలు అధికమవడం, కరెన్సీ మార్పిడి రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ప్రధాన కారణాలుగా కంపెనీ వివరించింది. నిజానికి ఇటీవలి కాలంలో రూపాయి బలహీనపడటం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే భాగాల ఖర్చు పెరుగుతోంది. ముఖ్యంగా లగ్జరీ కార్ల తయారీదారులు ఎక్కువగా దిగుమతి భాగాలు, పూర్తిగా తయారైన యూనిట్లపై ఆధారపడటం వల్ల కరెన్సీ మార్పుల ప్రభావం నేరుగా ఆటో సంస్థల మీద పడుతోంది. దీంతో BMW మాత్రమే కాకుండా ఇతర ప్రీమియం ఆటోమొబైల్ సంస్థలు కూడా ధరల సవరణలు చేపడుతున్నాయి.

Read Also: నిస్సాన్ షాక్.. గ్రావైట్ ధరలు భారీగా పెంపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×