E-Paper
Advertisement

మార్కెట్ లోకి BMW క్రేజీ అడ్వెంచర్ బైక్, ఏ వేరియంట్ తీసుకుంటే మంచిదంటే?

మార్కెట్ లోకి BMW క్రేజీ అడ్వెంచర్ బైక్, ఏ వేరియంట్ తీసుకుంటే మంచిదంటే?
Advertisement

BMW F 450 GS Launched in India: BMW మోటరాడ్ తాజాగా భారత మార్కెట్‌ లో F 450 GS బైక్‌ను విడుదల చేసింది. అడ్వెంచర్ రైడింగ్‌ కు అనుకూలంగా రూపొందించిన ఈ మోటార్‌ సైకిల్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలుగా నిర్ణయించింది. ప్రతి వేరియంట్‌ లో కొంత తేడా ఉన్నప్పటికీ, బేసిక్ నుంచి టాప్ మోడల్ వరకు మంచి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ బేస్ వేరియంట్

F 450 GSలో మొదటిగా బేస్ వేరియంట్ గురించి తెలుసుకుంటే… ఇది ఎంట్రీ లెవల్ అయినప్పటికీ ఫీచర్ల విషయంలో బాగుంటుంది. ఇందులో 6.5 అంగుళాల పెద్ద TFT డిస్‌ ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్‌ ను కంట్రోల్ చేయడానికి BMW ప్రత్యేకంగా ఇచ్చే రోటరీ కంట్రోలర్ కూడా ఉంటుంది. అలాగే హీటెడ్ గ్రిప్స్ లాంటి ఫీచర్ ఈ ధరలో రావడం ప్రత్యేకం. భద్రత కోసం ABS, ట్రాక్షన్ కంట్రోల్, అడ్జస్టబుల్ బ్రేక్, క్లచ్ లివర్లు ఉన్నాయి. ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ వేరియంట్ ఒకే ఒక్క బ్లాక్ కలర్‌ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

⦿ ఎక్స్‌ క్లూజివ్ వేరియంట్

Advertisement

రెండవది ఎక్స్‌ క్లూజివ్ వేరియంట్. ఇది బేస్ వేరియంట్‌ లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు కొన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంజిన్ గార్డ్, నకిల్ గార్డ్స్, పెద్ద విండ్‌ స్క్రీన్ లాంటి భాగాలు ఇందులో ఉంటాయి. దీని వల్ల రైడింగ్ మరింత సేఫ్‌ గా, కంఫర్ట్‌ గా ఉంటుంది. అదనంగా రైడింగ్ మోడ్స్ ప్రో, షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో కూడా లభిస్తాయి. ఆఫ్ రోడ్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫుట్‌ పెగ్‌ లు కూడా ఈ వేరియంట్‌లో ఉంటాయి. అయితే కలర్ ఆప్షన్ మాత్రం బేస్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

⦿ GS ట్రోఫీ వేరియంట్

మూడవది GS ట్రోఫీ వేరియంట్. ఇది ఈ బైక్‌లో టాప్ మోడల్. ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉంటాయి. అడ్జస్టబుల్ స్పోర్ట్ సస్పెన్షన్, ఈజీ రైడ్ క్లచ్, అల్యూమినియం ఇంజిన్ గార్డ్ లాంటి అంశాలు స్టాండర్డ్‌ గా అందిస్తారు. అలాగే టింటెడ్ ర్యాలీ విండ్‌ స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ వేరియంట్‌ లో ఎక్స్‌ క్లూజివ్ మోడల్‌ లో ఉన్న అన్ని ఫీచర్లు కూడా ఉంటాయి. డిజైన్ విషయంలో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలుపు రంగు ఛాసిస్, ట్రైకలర్ పెయింట్ స్కీమ్ వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Advertisement

మొత్తంగాF 450 GS మూడు వేరియంట్లు కూడా వేర్వేరు అవసరాల కోసం రూపొందించబడ్డాయి. సాధారణ రైడింగ్ కోసం బేస్ మోడల్ సరిపోతుంది. మరింత ఫీచర్లు కావాలంటే ఎక్స్‌ క్లూజివ్ తీసుకోవచ్చు. ఆఫ్ రోడ్, అడ్వెంచర్ రైడింగ్ కోసం టాప్ GS ట్రోఫీ వేరియంట్ బెస్ట్. బడ్జెట్, అవసరాలను బట్టి సరైన వేరియంట్ ను ఎంచుకోండి.

Read Also: మారుతి డిజైర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×