E-Paper
Advertisement

Geethu Royal – Mahindra XUV 3XO: బిగ్ బాస్ గీతూ రాయల్ కొన్న ఈ కారు ధర, ప్రత్యేకతలు తెలుసా?

Geethu Royal – Mahindra XUV 3XO: బిగ్ బాస్ గీతూ రాయల్ కొన్న ఈ కారు ధర, ప్రత్యేకతలు తెలుసా?
Advertisement

గీతూ రాయల్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గలాట గీతూ’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తన యాసతో అందరినీ ఆకట్టుకుంది. అటు బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’లోనూ సత్తా చాటింది. ఆ తర్వాత కొన్ని వివాదాల్లోనూ చిక్కింది. సావిత్రి మీద కామెంట్స్, బెట్టింగ్ యాప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపాయి.

అదిరిపోయే కారు కొన్న గీతు రాయల్

ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. తాజాగా తన కారుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. “ఎప్పుడూ ఏదీ నాకు తనంతగా తాను రాలేదు.ఈ రోజు నా దగ్గర ఉన్న ప్రతి చిన్న వస్తువు కూడా నేనే సంపాదించాను. ఒంటరిగా నిలబడి సాధించుకున్నాను. నా కలలను ఎవరూ నెరవేర్చలేదు. నా జీవితాన్ని మొదటి నుంచి నేనే నిర్మించుకున్నాను. నా జీవితంలో ప్రతి మైలు రాయి నాదే. సేఫ్టీ పిన్ నుంచి ఈ కారు వరకు” అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Advertisement

గీతు కొనుగోలు చేసిన కారు ప్రత్యేకతలు ఇవే!

గీతూ మహీంద్రా XUV 3XOను కొనుగోలు చేసింది. ఇదో ప్రీమియం సబ్ కాంపాక్ట్ SUV. ఇది XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గా మార్కెట్లోకి వచ్చింది. ఫీచర్ రిచ్, స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారు బేస్ మోడల్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 7.28 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్ టర్బో ధర రూ. 14.40 లక్షలు. ఇందులో 29 వేరియంట్లు ఉన్నాయి. వాటిలో పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమాటిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్లు, పెర్ఫార్మెన్స్

Advertisement

మహీంద్రా XUV 3XO 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్ 110 bhp పవర్  20 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది.1.2L TGDi టర్బో పెట్రోల్ 130 bhp పవర్, 230 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5L డీజిల్ వెర్షన్ 117 bhp పవర్ ను కలిగి ఉంటుంది. 20 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ను కలిగి ఉంటుంది.

మహీంద్రా XUV 3XOను ఫీచర్లు

ఈ కారు పానోరమిక్ సన్‌రూఫ్ ను కలిగి ఉంటుంది. లెవల్-2 ADAS ఉంటుంది.  10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది.  హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. 360° కెమెరా, డ్యూయల్ జోన్ AC, వైర్‌ లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. 5-స్టార్ ఇండియన్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ ఉంది. రీసెంట్ గానే XUV 3XO EV లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఫుల్ ఛార్జ్ తో 350 కిలో మీటర్ల రేంజ్ వస్తుంది. ఫిబ్రవరి 2026 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా గీతూ కొత్త కారుతో మరోసారి వార్తల్లో నిలిచింది.

Read Also: కియా నుంచి కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లాంచ్, EV2 ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×