E-Paper
Advertisement

1200 కి.మీ రేంజ్.. 3.5 లక్షలు.. భారత మార్కెట్లోకి సూపర్ ఈవీ వచ్చేస్తోంది!

1200 కి.మీ రేంజ్.. 3.5 లక్షలు.. భారత మార్కెట్లోకి సూపర్ ఈవీ వచ్చేస్తోంది!
Advertisement

Bestune Xiaoma EV: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లను ఆయా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో తక్కువ దూర ప్రయాణాలకు సరిపోయే మైక్రో EVలపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన FAW గ్రూప్ తయారు చేసిన బెస్ట్‌ ట్యూన్ షావోమీ అనే చిన్న ఎలక్ట్రిక్ కారు చైనాలో మంచి గుర్తింపు పొందుతోంది. తక్కువ ధర, చిన్న సైజు, ఆకట్టుకునే డిజైన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

నగర ప్రయాణాలకు అనుకూలంగా..

బెస్ట్‌ ట్యూన్ షావోమీ ప్రధానంగా నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. రద్దీ రోడ్లపై సులభంగా నడపడానికి వీలుగా దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌ గా ఉంటుంది. చిన్న కుటుంబాలు, విద్యార్థులు, ఆఫీసుకు రోజూ వెళ్లే ఉద్యోగులకు ఈ కారు ఉపయోగకరంగా ఉంటుంది. ధర విషయానికి వస్తే, చైనాలో ఈ కారు ప్రారంభ ధర భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర దాదాపు రూ. 5.8 లక్షల వరకు ఉంటుంది. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందుతోంది.

ఒకే ఛార్జ్ తో 1200 కి.మీ రేంజ్

Advertisement

ఈ కారులో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వివిధ రేంజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 1200 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుందని సమాచారం. వాస్తవ పరిస్థితుల్లో రేంజ్ అనేది రోడ్లు, ట్రాఫిక్, డ్రైవింగ్ విధానం లాంటి అంశాలపై ఆధారపడి మారే అవకాశం ఉంది.

అత్యాధునిక ఫీచర్లు

బెస్ట్‌ ట్యూన్ షావోమీలో ఆధునిక ఫీచర్లను ఉన్నాయి. సోలార్ రూఫ్, డిజిటల్ డిస్‌ ప్లే, పవర్ విండోలు లాంటి ఫీచర్లతో పాటు భద్రత కోసం ABS, EBD, ఎయిర్‌ బ్యాగ్‌ లు లాంటి సేఫ్టీ టెక్నాలజీలు ఉండొచ్చని తెలుస్తోంది. చిన్న కారు అయినప్పటికీ నగర అవసరాలకు సరిపోయే విధంగా దీన్ని డిజైన్ చేశారు.

వినియోగదారులలో కన్ఫ్యూజన్

Advertisement

చాలామంది షావోమీ కంపెనీ, ఇదీ ఒకటే అనుకుంటున్నారు.  కానీ, బెస్ట్‌ ట్యూన్ షావోమీ,  షావోమీ SU7 రెండూ వేర్వేరు ఎలక్ట్రిక్ కార్లు. బెస్ట్‌ ట్యూన్ షావోమీ అనేది చౌక ధరలో వచ్చే చిన్న ఎలక్ట్రిక్ కారు కాగా, షావోమీ SU7  ప్రీమియం సెడాన్ ఎలక్ట్రిక్ కారు. ధరలు, ఫీచర్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం చైనాలో మైక్రో ఎలక్ట్రిక్ కార్లకు మంచి మార్కెట్ ఉంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారికి ఇలాంటి కార్లు మంచి ఎంపికగా మారుతున్నాయి. ఈ కారు త్వరలో ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×