E-Paper
Advertisement

ఏంటీ.. ఈ టైమ్ లో ఈవీ ఛార్జ్ చేస్తే కరెంటు బిల్లు అంత తక్కువగా వస్తుందా? వెంటనే ట్రై చేయండి!

ఏంటీ.. ఈ టైమ్ లో ఈవీ ఛార్జ్ చేస్తే కరెంటు బిల్లు అంత తక్కువగా వస్తుందా? వెంటనే ట్రై చేయండి!
Advertisement

ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే EVలను నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సరైన సమయంలో ఇంట్లో కారును ఛార్జ్ చేస్తే విద్యుత్ బిల్లులో కూడా మంచి మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈవీ ఛార్జింగ్ కు బెస్ట్ టైమ్ ఏదంటే?

Advertisement

ఇంట్లో EVని ఛార్జ్ చేయడానికి బెస్ట్ టైమ్ విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే ఆఫ్ పీక్ అవర్స్. ఈ సమయంలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి, చాలా విద్యుత్ సంస్థలు తక్కువ టారిఫ్‌ లను అందిస్తాయి. సాధారణంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆఫ్ పీక్ సమయంగా పరిగణిస్తారు. టైమ్ ఆఫ్ యూజ్ విద్యుత్ ప్లాన్ ఉన్నవారికి ఈ సమయంలో ఛార్జింగ్ చేయడం వల్ల మంచి ఆదా ఉంటుంది.

ఇక ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నవారికి పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. పగటి సమయంలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ ను ఉపయోగించి కారును ఛార్జ్ చేస్తే ఖర్చు దాదాపు ఉండదు. అందుకే, సోలార్ విద్యుత్‌ ను EV ఛార్జింగ్‌ కు బెస్ట్ అంటారు నిపుణులు. అంతేకాదు, కొన్ని విద్యుత్ కంపెనీలు EV యజమానుల కోసం ప్రత్యేక విద్యుత్ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లలో నిర్ణీత సమయాల్లో ఉచితంగా, చాలా తక్కువ ధరకు విద్యుత్ వినియోగించే అవకాశం ఉంటుంది. అలాంటి ప్లాన్‌ను ఎంచుకుంటే, ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

కొన్ని దేశాల్లో విద్యుత్ సంస్థలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లేదా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక తక్కువ టారిఫ్‌లను అమలు చేస్తున్నాయి. ఈ సమయంలో EV ఛార్జింగ్ చేస్తే సాధారణ సమయంతో పోలిస్తే విద్యుత్ వినియోగం ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో EVలకు ప్రత్యేకంగా రూపొందించిన విద్యుత్ ప్లాన్‌లను ఉపయోగించే కుటుంబాలు ఏడాదికి సుమారు 180 నుంచి 1,800 డాలర్ల వరకు ఆదా చేసే అవకాశం ఉందని తేలింది.  అయితే, ప్రతి కంపెనీ ప్లాన్ ఒకే విధంగా ఉండదు. కొందరు రిటైలర్లు తక్కువ టారిఫ్ పేరుతో ఇతర సమయాల్లో ఎక్కువ ఛార్జీలు కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే, కొత్త ప్లాన్ తీసుకునే ముందు దాని నిబంధనలు, టారిఫ్‌లు పూర్తిగా పరిశీలించడం మంచిది.

నిపుణులు ఏం చెప్తున్నారంటే?

నిపుణులు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నారు. ఆఫ్ పీక్ సమయాల్లో కేవలం ఎలక్ట్రిక్ కారును మాత్రమే కాకుండా, వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, వాటర్ హీటర్ లాంటి ఎక్కువ విద్యుత్ వినియోగించే గృహోపకరణాలను కూడా అదే సమయంలో ఉపయోగిస్తే విద్యుత్ బిల్లును మరింత తగ్గించుకోవచ్చు అంటున్నారు. సోలార్ విద్యుత్ ఉంటే పగటి సమయంలో ఛార్జింగ్ చేయడం మంచిది. సోలార్ లేకపోతే టైమ్ ఆఫ్ యూజ్ ప్లాన్‌ లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఛార్జ్ చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది.

Read Also: మొబైల్ ఫోన్లతో ఈవీ వాహనాలను ఆపేస్తున్న ఆకతాయిలు.. ఓర్ని ఇలా కూడా చేయొచ్చా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×