E-Paper
Advertisement

హాట్ వెదర్‌కు కూల్ SUVలు, రూ. 12 లక్షల్లోపు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్ మోడల్స్ ఇవే!

హాట్ వెదర్‌కు కూల్ SUVలు, రూ. 12 లక్షల్లోపు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్ మోడల్స్ ఇవే!
Advertisement

Budget SUVs With Ventilated Seats: ఒకప్పుడు ఖరీదైన కార్లలో మాత్రమే కనిపించిన వెంటిలేటెడ్ సీట్లు, ఇప్పుడు తక్కువ ధరలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. హాట్ వెదర్, ట్రాఫిక్ లో ప్రయాణించే వారు ఈ ఫీచర్‌ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కార్ల తయారీ కంపెనీలు కూడా బడ్జెట్ సెగ్మెంట్‌ లోనే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్ SUVలలో ఈ ఫీచర్ ఎక్కువగా కనిపిస్తోంది. రూ. 12 లక్షల లోపు ధరలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కొన్ని పాపులర్  SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ రెనాల్ట్ కిగర్

ఈ మోడల్ తక్కువ ధరలో వెంటిలేటెడ్ సీట్లతో వస్తుంది. టాప్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ. 8.4 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ SUVలో 8 అంగుళాల టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌ లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, డ్రైవ్ మోడ్స్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు దీనిలో ఉన్నాయి.

⦿ కియా సోనెట్

Advertisement

ఈ మోడల్  స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి ఫీచర్లను అందించే SUVగా గుర్తింపు తెచ్చుకుంది. HTX వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ధర సుమారు రూ. 11.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్, సన్‌ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

⦿ స్కోడా కైలాక్

ఇది కూడా ప్రీమియం ఫీల్ ఇచ్చే SUV. దీని టాప్ వేరియంట్‌ లో వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి. సుమారు రూ. 11.75 లక్షల ధరతో ఇది మార్కెట్లో ఉంది. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్, సన్‌ రూఫ్, పవర్డ్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో మంచి పనితీరును ఇస్తుంది.

⦿ హ్యుండాయ్ వెన్యూ

Advertisement

ఈ మోడల్ HX8 వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు లభిస్తాయి. ధర రూ. 11.9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు కూడా లభిస్తాయి.

⦿ కియా సైరోస్

ఇందులో ముందే కాకుండా వెనుక సీట్లకు కూడా వెంటిలేషన్ సౌకర్యం కలిగి ఉంటాయి. దీని HTX వేరియంట్ నుంచి ముందు సీట్ల వెంటిలేషన్ అందుబాటులో ఉంటుంది. అయితే, వెనుక సీట్లకు ఈ ఫీచర్ టాప్ వేరియంట్‌ లో మాత్రమే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి.

⦿ టాటా నెక్సాన్

దేశంలో అత్యంత ఆదరణ దక్కించుకున్న SUVలలో టాటా నెక్సాన్ ఒకటి. ఫియర్‌ లెస్ ప్లస్ వేరియంట్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ధర రూ. 12 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. పెట్రోల్, డీజిల్, CNG ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: బ్రెజ్జా vs నెక్సాన్.. బేస్ వేరియంట్‌ లో ఏది బెస్ట్ SUV?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×