E-Paper
Advertisement

టాటా To మహీంద్రా.. రూ.40 లక్షల్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

టాటా To మహీంద్రా.. రూ.40 లక్షల్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు ఇవే!
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల ధరల మధ్య ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలను కొనుగోలు చేయాలనుకునే వారికి బోలెడు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా, మహీంద్రా లాంటి ఇండియన్ కంపెనీలు ఈ సెగ్మెంట్ లో సత్తా చాటుతుండగా, విన్‌ ఫాస్ట్, BYD లాంటి ఫారిన్ బ్రాండ్లు కూడా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ ధరల రేంజ్ లో బెస్ట్ 5 ఎలక్ట్రిక్ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మహీంద్రా XEV 9S

రూ.20.70 లక్షల నుంచి రూ.30.20 లక్షల మధ్య ధర కలిగిన మహీంద్రా XEV 9S ప్రస్తుతం మార్కెట్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ SUV పనితీరు, ఫీచర్లు, రేంజ్ పరంగా మంచి బ్యాలెన్స్ ను అందిస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 679 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు ఈ కారులో ఉంటాయి.

2.మహీంద్రా XEV 9e

Advertisement

రూ.22.65 లక్షల నుంచి రూ.31.25 లక్షల ధరతో లభించే XEV 9e, కూపే స్టైల్ డిజైన్‌ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మోడల్ రైడింగ్, హ్యాండ్లింగ్ పరంగా మరింత మెరుగ్గా ఉంటుంది. కూపే డిజైన్ కారణంగా క్యాబిన్‌ లో కొంత స్థలం తగ్గుతుంది. ఈ SUVలో 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌ లు  అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా 656 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

3.టాటా హారియర్ EV

టాటా హారియర్ EV ధర రూ.21.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్‌లో ఆల్ వీల్ డ్రైవ్   ఆప్షన్‌ను అందిస్తోంది. 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ మోడల్ గరిష్టంగా 627 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ను అందిస్తుంది. పనితీరు, ఫీచర్ల పరంగా హారియర్ EV బలంగా ఉన్నప్పటికీ, రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మహీంద్రా మోడళ్ల కంటే కొంత వెనుకబడి ఉంది.

4.విన్‌ఫాస్ట్ VF 7

Advertisement

వియత్నాంకు చెందిన విన్‌ ఫాస్ట్ కంపెనీ నుంచి వచ్చిన VF 7 ధర రూ.21.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ AWD వేరియంట్‌లో 350 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే ఈ SUV, పనితీరు పరంగా అత్యంత శక్తివంతమైన మోడళ్లలో ఒకటి. 59.6kWh, 70.8kWh బ్యాటరీ ఆప్షన్లతో ఇది గరిష్టంగా 510 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్, మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది.

5.BYD అట్టో 3

రూ.24.99 లక్షల నుంచి రూ.33.99 లక్షల ధరతో లభించే BYD అట్టో 3, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించే SUVగా గుర్తింపు పొందింది. ఇందులో 49.9kWh, 60.48kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. గరిష్టంగా 521 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

Read Also: భారత్‌ లోకి MG క్రేజీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV.. దీపావళికి ముందే ఎంట్రీ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×