E-Paper
Advertisement

దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ఏ సెగ్మెంట్‌ లో ఏది బెస్ట్ అంటే?

దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ఏ సెగ్మెంట్‌ లో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Segment Wise Best Mileage Cars 2026: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో కార్ల కొనుగోలుదారులు  మైలేజ్‌ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం కారు ధర మాత్రమే కాదు, ప్రతి నెలా ఫ్యూయెల్ ఖర్చు ఎంత అవుతుందనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సెగ్మెంట్స్ లో ఎక్కువ ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఇచ్చే కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న హ్యాచ్‌ బ్యాక్‌ ల నుంచి లగ్జరీ EVల వరకు ఏ సెగ్మెంట్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయో తెలుసుకుందాం..

⦿ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌ 

ఈ సెగ్మెంట్‌ లో మారుతి సుజుకి ఆల్టో K10 ఇప్పటికీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు దాదాపు 24.9 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ సుమారు 33.4 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, చిన్న కుటుంబాలకు సరిపడే పరిమాణం వల్ల చాలా మంది దీనిని కొనుగోలు చేస్తున్నారు.

⦿ రూ. 5- 10 లక్షల్లోపు విభాగం

Advertisement

రూ. 5 నుంచి రూ. 10 లక్షల విభాగంలో మారుతి సుజుకి డిజైర్ CNG ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడల్ గా నిలిచింది. పెట్రోల్ AMT వేరియంట్ సుమారు 25.7 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుండగా, CNG వెర్షన్ కిలోకు 33.7 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. సెడాన్ స్టైల్, మంచి క్యాబిన్ స్పేస్, తక్కువ రన్నింగ్ ఖర్చు కావాలనుకునే కుటుంబాలకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ రూ. 10- 20 లక్షల్లోపు విభాగం

రూ.10 నుంచి రూ. 20 లక్షల SUV విభాగంలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రత్యేక స్థానం సంపాదించింది. దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు దాదాపు 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ కూడా మంచి మైలేజ్ అందిస్తుంది. సిటీఅలో ఎక్కువగా ప్రయాణించే వారికి హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇంధన ఖర్చు భారీగా తగ్గుతుంది. అదే సమయంలో SUV కంఫర్ట్ ను అందిస్తుంది.

⦿ ప్రీమియం MPV సెగ్మెంట్‌

Advertisement

ఈ సెగ్మెంట్ లో టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. లీటరుకు 23 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. పెద్ద కుటుంబాలు, ఎక్కువగా హైవే ప్రయాణాలు చేసే వారికి  ఇది మంచి ఆప్షన్ గా మారింది. సౌకర్యం, విశాలమైన క్యాబిన్, హైబ్రిడ్ టెక్నాలజీ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

⦿ లగ్జరీ సెగ్మెంట్‌

ఈ సెగ్మెంట్ లో BMW iX1 LWB పూర్తి ఎలక్ట్రిక్ SUVగా ఆకట్టుకుంటుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ అవసరం ఉండదు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 531 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని చెబుతోంది. లగ్జరీతో పాటు ఇంధన ఖర్చులను  తగ్గించుకునాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: నిజంగా వండర్.. పెట్రోల్, సీఎన్జీతో పోల్చితే కొత్త టియాగో ఈవీ మరింత చీప్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×