E-Paper
Advertisement

Best Family Cars: మారుతి సుజుకి To కియా.. దేశీ మార్కెట్లో బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!

Best Family Cars:  మారుతి సుజుకి To కియా.. దేశీ మార్కెట్లో బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
Advertisement

Best Family Cars 2025: దేశీ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు క్రేజీ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఫ్యామిలీకి సెట్ అయ్యే బెస్ట్ కార్లు బోలెడు ఉన్నాయి. వీటిలో సెడాన్, SUV, MPV కార్లు ఉన్నాయి. స్పేస్, సేఫ్టీ, మైలేజ్, ఫీచర్లు, రిలయబిలిటీ లాంటి ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. పాపులర్ సేల్స్, యూజర్ రివ్యూస్, ARAI మైలేజ్ ఆధారంగా 2025లో ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

 ⦿ మారుతి సుజుకి ఎర్టిగా (MPV)

ఇది ఏటు సీట్లను కలిగి ఉంటుంది. ధర రూ. 8.80 – 13.40 లక్షలు ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 20.3-20.5 కిలో మీటర్లు ఇస్తుంది. CNG 26.1మైలేజ్ ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే 1.5L పెట్రోల్/CNG, 6 ఎయిర్‌ బ్యాగ్స్ స్టాండర్డ్, టచ్‌ స్క్రీన్, రియర్ AC వెంట్స్, లో మెయింటెనెన్స్ ను కలిగి ఉంటుంది. బడ్జెట్ 7-సీటర్ ఫ్యామిలీస్, హై మైలేజ్ లాంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.

⦿ కియా కారెన్స్ (MPV)

Advertisement

ఇది 6 లేదంటే 7 సీట్లను కలిగి ఉంటుంది. ధర రూ. 10.99 – రూ.19.50 లక్షలు ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 15-18 కీలో మీటర్లు,  డీజిల్ 20-21 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే 1.5L పెట్రోల్, టర్బో, డీజిల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, ADAS,  ప్రీమియం ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది.

⦿ హ్యుందాయ్ క్రెటా (కాంపాక్ట్ SUV)

ఇది 5 సీట్లను కలిగి ఉంటుంది. ధర రూ.10.73 – రూ. 20.20 లక్షలు ఉంటుంది. పెట్రోల్ వేరియెంట్ 17-18 కిలో మీటర్లు డీజిల్ 19-21 కిలో మీటర్లు అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే 1.5L పెట్రోల్, టర్బో, డీజిల్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, 6 ఎయిర్‌ బ్యాగ్స్ ను కలిగి ఉంటుంది.

⦿ టాటా నెక్సాన్ (కాంపాక్ట్ SUV)

Advertisement

ఇది 5 సీట్లను కలిగి ఉంటుంది. ధర రూ. 8.00 – రూ. 15.50 లక్షలను కలిగి ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 17-18 కిలో మీటర్లు అందిస్తుంది. డీజిల్ 22-24 కిలో మీటర్లు ఇస్తుంది. 1.2L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్, 5 స్టార్ సేఫ్టీ, 360° కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ ను కలిగి ఉంటుంది.

⦿ మహీంద్రా XUV700 (మిడ్-సైజ్ SUV)

ఇందులో 5, 6, 7 సీట్లు ఉంటాయి. ధర రూ. 13.66 – రూ. 25.14 లక్షలు ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 13-15 కి.మీ,  డీజిల్ 15-17 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. 2.0L టర్బో పెట్రోల్, 2.2L డీజిల్ (AWD ఆప్షన్), ADAS, పనోరమిక్ సన్‌ రూఫ్, 7 ఎయిర్‌ బ్యాగ్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read Also: మహీంద్రా XUV 7XO లాంచ్ డేట్ ఫిక్స్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

⦿మారుతి సుజుకి బ్రెజా (సబ్-కాంపాక్ట్ SUV)

ఇందులో 5 సీట్లు ఉంటాయి. ధర రూ. 8.26 – రూ.14.00 లక్షలు ఉంటుంది. పెట్రోల్ 19-20 కి.మీ, CNG  25కి పైగా కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 1.5L పెట్రోల్/CNG, సన్‌ రూఫ్, 360° కెమెరా, 6 ఎయిర్‌ బ్యాగ్స్ ను కలిగి ఉంటుంది.

⦿ టయోటా ఇన్నోవా క్రిస్టా (MPV)

ఈ కారులో 7 లేదంటే 8 సీట్లు ఉంటాయి. ధర రూ. 18.66 – రూ. 26.00 లక్షలను కలిగి ఉంటుంది. డీజిల్  12-15 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 2.4L డీజిల్, రిలయబుల్ ఇంజన్, స్పేషియస్ ను కలిగి ఉంటుంది.

Read Also: ఎలక్ట్రిక్ బైక్ vs పెట్రోల్ బైక్.. ఏది బెస్ట్? ఎందుకంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×