E-Paper
Advertisement

Classic Japanese Cars: బెస్ట్ జపనీస్ క్లాసిక్ కార్లు.. ఆ దేశంలో వీటికి ఫుల్ క్రేజ్ భయ్యా!

Classic Japanese Cars: బెస్ట్ జపనీస్ క్లాసిక్ కార్లు.. ఆ దేశంలో వీటికి ఫుల్ క్రేజ్ భయ్యా!
Advertisement

Classic Japanese Cars 1960-1990: జపాన్ నుంచి వచ్చిన క్లాసిక్ కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందాయి. 1960-1990ల దశకాల్లోని ఐకానిక్ మోడల్స్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ఇవి డిజైన్, పెర్ఫార్మెన్స్, ఇన్నోవేషన్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ క్లాసిక్ జపనీస్ కార్లు ఏవనేది ఇప్పుడు చూద్దాం..

⦿ Toyota 2000GT (1967-1970)

యమహాతో కలిసి టయోటా తయారు చేసిన మొదటి సూపర్‌ కార్ ఇది. జేమ్స్ బాండ్ మూవీ ‘You Only Live Twice’లో కనిపించింది. యూరోపియన్ సూపర్‌ కార్లకు సమానంగా డిజైన్ చేయబడింది. 2.0L ఇన్‌లైన్-6 ఇంజన్, 150 hp, 0-100 km/h 8.6 సెకన్లు, టాప్ స్పీడ్ 220 km/h. డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. దీనిని జపనీస్ E-టైప్ అని పిలుస్తారు. అందమైన డిజైన్, హై పెర్ఫార్మెన్స్ కారణంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ కారుతో జపాన్ ఆటో ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసింది. దీని ప్రస్తుత విలువ  మంచి కండిషన్‌లో ఉంటే రూ. 5-10 కోట్లు ఉంటుంది.

⦿ Datsun 240Z (1969-1978)

Advertisement

నిస్సాన్ కంపెనీ తయారు చేసిన ఈ కారు, అమెరికాలో బాగా పాపులర్ అయ్యింది. స్పోర్ట్స్ కార్ మార్కెట్‌ను ఈ మోడల్ పూర్తిగా మార్చేసింది. 2.4L ఇన్‌లైన్-6 ఇంజన్, 151 hp, 0-100 km/h 8 సెకన్లు, టాప్ స్పీడ్ 200 km/Hను కలిగి ఉంటుంది. ఇండిపెండెంట్ సస్పెన్షన్, సరసమైన ధరలో హై పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్ కారణంగా మిలియన్ల కొద్దీ యూనిట్లు అమ్ముడైంది. ప్రస్తుత విలువ రూ. 20-50 లక్షలు ఉంటుంది.

⦿ Nissan Skyline 2000 GT-R Hakosuka (1969-1972)

దీనిని హకోసుకా అని పిలుస్తారు. రేసింగ్ హెరిటేజ్, జపాన్ మోటార్‌స్పోర్ట్స్‌ లో లెజెండ్. 2.0L ఇన్‌లైన్-6 ఇంజన్, 160 hp, 0-100 km/h 7 సెకన్లు, టాప్ స్పీడ్ 200 km/h,  రేస్ స్పెస్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. GT-R లైనేజ్ మొదలు, రేసింగ్ విక్టరీలు,  గ్రాన్ టురిస్మో గేమ్స్‌ లో ఫేమస్ అయ్యింది. ప్రస్తుత విలువ రూ.1-3 కోట్లు ఉంటుంది.

⦿ Mazda RX-7 FD (1991-2002)

Advertisement

మాజ్డా రోటరీ ఇంజన్ స్పోర్ట్స్ కార్ ఇది. మూడవ జనరేషన్ (FD) అత్యంత పాపులర్ అయ్యింది. 1.3L ట్విన్-టర్బో రోటరీ ఇంజన్, 255 hp, 0-100 km/h 5 సెకన్లు, టాప్ స్పీడ్ 250 km/h, లైట్‌ వెయిట్ బాడీని కలిగి ఉంటుంది. రోటరీ ఇంజన్ యూనిక్ సౌండ్,  పెర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్ సూపర్ ఉంటుంది. ఫాస్ట్, ఫ్యూరియస్ సినిమాల్లో బాగా ఫేమస్. ప్రస్తుత విలువ రూ. 30-80 లక్షలు ఉంటుంది.

⦿ Honda NSX (1990-2005)

హోండా తయారు చేసిన ఈ మిడ్ ఇంజన్ సూపర్‌ కార్ ఫెరారీలకు సవాల్ విసిరింది. 3.0L V6 ఇంజన్, 270 hp, 0-100 km/h 5.8 సెకన్లు, టాప్ స్పీడ్ 270 km/hను కలిగి ఉంటుంది. అల్యూమినియం బాడీ, VTEC టెక్నాలజీతో రూపొందింది. సూపర్‌ కార్ పెర్ఫార్మెన్స్‌ తో డైలీ డ్రైవర్ కంఫర్ట్ గా ఉంటుంది. ప్రస్తుత విలువ రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉంటుంది.

Read Also: 90s దుమ్మురేపిన కార్లు, ఆ రోజుల్లో వీటికి ఉండే క్రేజే వేరు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×