E-Paper
Advertisement

Best Cars Under Rs 10 Lakhs: రూ.10 లక్షలలోపు బెస్ట్ కార్లు.. 6 ఎయిర్ బ్యాగ్ లు, సూపర్ సెక్యూరిటీ ఫీచర్లు

Best Cars Under Rs 10 Lakhs: రూ.10 లక్షలలోపు బెస్ట్ కార్లు.. 6 ఎయిర్ బ్యాగ్ లు, సూపర్ సెక్యూరిటీ ఫీచర్లు
Advertisement

Best Cars Under Rs 10 Lakhs:ప్రస్తుతం కారు కొనుగోలుదారులు సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువగా చూస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయా? లేదా? అని చూస్తున్నారు. రూ.10 లక్షల లోపున్న బడ్జెట్.. .. బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లు, 5 స్టార్ రేటింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న నాలుగు బెస్ట్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్కోడా కైలాక్

స్కోడా కైలాక్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లో అందుబాటులో ఉంది. ఇది ఐదు సీట్ల వెహికల్, ఫ్యూయల్ టైప్, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ బట్టి మైలేజ్ 19.05-19.68 kmplగా ఉంది. స్కోడా కైలాక్ 4 మీటర్ల లోపు వాహనం, దీనిని ప్రత్యేకంగా భారతీయ డ్రైవింగ్ కండిషన్ల కోసం డెవలప్ చేశారు. ఇది BNCAP 5 స్టార్ రేటింగ్‌ ను పొందింది. ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో ABS, EBD, ESC, ట్రాక్షన్ కంట్రోల్, రోల్‌ఓవర్ ప్రొటెక్షన్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనపు సెక్యూరిటీ ఫీచర్లలో TPMS, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో రియర్‌వ్యూ కెమెరా ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.59 లక్షల నుంచి స్టార్ అవుతుంది.

టాటా పంచ్

Advertisement

4 మీటర్ల లోపు క్రాస్ఓవర్ సెక్షన్ లో మరో బెస్ట్ కారు టాటా పంచ్. ఫేస్‌లిఫ్ట్, కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో టాటా పంచ్ లో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. దీనికి BNCAP 5 స్టార్ రేటింగ్‌ ఇచ్చింది. స్టాండర్ట్ సెక్యూరిటీ ఫీచర్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఆల్ వీల్ డిస్క్‌లు, ESP, ITPMS, క్రూయిజ్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లను కలిగి ఉంది. అదనపు ఫీచర్లలో 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, రివర్స్ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లైండ్-స్పాట్ మానిటర్ ఉన్నాయి. పంచ్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.5.59 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

న్యూ హోండా అమేజ్

న్యూ హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ పరిమాణంలో స్పెషియస్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ సెడాన్ కు BNCAP 5 స్టార్ రేటింగ్‌ ఇచ్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్లు, స్పీడ్ అలర్ట్‌లు ఉన్నాయి. ఇంకా ఇందులో TPMS, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.7.47 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

నిస్సాన్ మాగ్నైట్

Advertisement

నిస్సాన్ మాగ్నైట్ 4 మీటర్ల లోపు వాహనం. ఇది అట్రాక్టివ్ ఆన్-రోడ్ డిజైన్‌తో పాటు లేటెస్ట్ ఇంటీరియర్‌ ను కలిగి ఉంది. ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ESC, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX మౌంట్‌లు ఉన్నాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో మాగ్నైట్ 5 స్టార్ రేటింగ్ ను పొందింది. దీని ధర రూ.5.61 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

Also Read: హోండా To కియా.. త్వరలో మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్న క్రేజీ ఈవీలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×