// // BAT-BMS: మొబైల్ ఫోన్లతో ఈవీ వాహనాలను ఆపేస్తున్న ఆకతాయిలు.. ఓర్ని ఇలా కూడా చేయొచ్చా? -->
E-Paper
Advertisement

మొబైల్ ఫోన్లతో ఈవీ వాహనాలను ఆపేస్తున్న ఆకతాయిలు.. ఓర్ని ఇలా కూడా చేయొచ్చా?

మొబైల్ ఫోన్లతో ఈవీ వాహనాలను ఆపేస్తున్న ఆకతాయిలు.. ఓర్ని ఇలా కూడా చేయొచ్చా?
Advertisement

ఇటీవల సోషల్ మీడియాలో BAT BMS అనే చైనాకు చెందిన మొబైల్ యాప్ గురించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ యాప్ బ్లూ టూత్ ద్వారా సమీపంలో ఉన్న కొన్ని ఈ రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటీలకు కనెక్ట్ అయి వాటి పవర్‌ ను రిమోట్‌ గా ఆన్, ఆఫ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇంతకీ వైరల్ వీడియోల్లో ఏముందంటే?

Advertisement

వైరల్ వీడియోలను చూస్తే, వెహికల్ ఓనర్ కు సంబంధం లేకుండానే BAT BMS యాప్ ద్వారా ఆన్ ఆఫ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న వెహికల్ ను అకస్మాత్తుగా ఆపివేసే అవకాశం ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలు ఈవీలను యాప్ సాయంతో ఆపేస్తే, డ్రైవర్‌ తో పాటు ఇతర వాహనదారుల భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది

ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత సైబర్ సెక్యూరిటీ, కనెక్టెడ్ ఎలక్ట్రిక్ వాహనాల భద్రత, బ్లూటూత్ ద్వారా పనిచేసే పరికరాల సెక్యూరిటీ లాంటి అంశాలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం లేటెస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల్లో మొబైల్ యాప్‌ల ద్వారా బ్యాటరీ సమాచారం చూడడం, లాక్, అన్‌ లాక్ చేయడం లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి యాప్‌ల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైరల్ వార్తల్లో నిజం ఎంత?

Advertisement

BAT BMS యాప్‌ కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నిజమని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి  ఆధారాలు లేవు. ఈ యాప్‌ను ఉపయోగించి నిజంగా ఎవరైనా వాహనాలను రిమోట్‌ గా ఆపివేసిన, ప్రమాదాలు జరిగి ఘటనలు బయటకు రాలేదు. ఈ అంశంపై ప్రభుత్వ సంస్థలు, సంబంధిత అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి  ప్రకటన విడుదల చేయలేదు. వైరల్ వీడియోల్లో కనిపిస్తున్న విషయాలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అపోహ అనే దానిపై కూడా స్పష్టత రాలేదు. దీంతో ప్రస్తుతం ఈ ఆరోపణలను పూర్తిగా నిజమని, పూర్తిగా తప్పు అని చెప్పలేకపోతున్నారు.

సైబర్ నిపుణులు ఏం చెప్తున్నారంటే?  

సైబర్ నిపుణులు ఈ వ్యవహారంపై కీలక సూచనలు చేస్తున్నారు. బ్లూటూత్, ఇతర వైర్‌ లెస్ టెక్నాలజీలను ఉపయోగించే ఏ డివైజ్ అయినా సరైన భద్రతా వ్యవస్థలు లేకపోతే మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకే వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్లు అందించడం, భద్రతా లోపాలను సరిదిద్దడం చాలా కీలకం అంటున్నారు.

BAT BMS యాప్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, అసలు నిజం ఏంటనేది ఇప్పటివరకు అధికారికంగా కన్ఫార్మ్ కాలేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకుండా, అధికారిక సంస్థల నుంచి వచ్చే వివరాలను పరిశీలించిన తర్వాతే నిజానిజాలు నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: E20 పెట్రోల్.. మైలేజ్ తగ్గడమే కాదు.. ఈ సమస్యలు కూడా వస్తాయట, షాకిచ్చిన తాజా సర్వే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×