E-Paper
Advertisement

బాలెనో To అమేజ్.. రూ.10 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!

బాలెనో To అమేజ్.. రూ.10 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!
Advertisement

Best Automatic Cars Under Rs 10 Lakh: దేశంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లను తీసుకుంటున్నారు.  ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు ఖరీదైనవిగా భావించేవారు. కానీ, ఇప్పుడు రూ.10 లక్షల లోపు బడ్జెట్‌ లోనే మంచి ఫీచర్లు, ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించే పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 2026లో కొనుగోలుదారులను ఆకట్టుకునే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి సుజుకి బాలెనో

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ లలో బాలెనో ఒకటి. ఇందులో 5-స్పీడ్ AMT గేర్‌ బాక్స్ అందుబాటులో ఉంది. విశాలమైన క్యాబిన్, మంచి ఇంటీరియర్ డిజైన్, ఎక్కువ మైలేజ్ ఈ కారును కుటుంబాలకు మంచి ఆప్షన్ గా కొనసాగుతోంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ధరలు సుమారు రూ.5.99 లక్షల నుంచి రూ.9.10 లక్షల వరకు ఉన్నాయి.

2.టాటా పంచ్

Advertisement

మైక్రో SUV విభాగంలో టాటా పంచ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ మోడల్ పెట్రోల్‌ తో పాటు CNG వెర్షన్‌ లో కూడా AMT ఆప్షన్‌ ను అందిస్తుంది. ఎత్తైన సీటింగ్ పొజిషన్, బలమైన నిర్మాణం, భద్రతా పరంగా మంచి రేటింగ్స్ ఉన్నాయి. నగరంతో పాటు పొడవైన ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీని ధరలు రూ.7.60 లక్షల నుంచి రూ.9.60 లక్షల మధ్య ఉన్నాయి.

3.మారుతి సుజుకి డిజైర్

సెడాన్ కొనాలనుకునే వారికి డిజైర్ మంచి ఆప్షన్. ఇందులో 5 స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్ అందుబాటులో ఉంది. సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి రీసేల్ వ్యాల్యూ కారణంగా ఈ కారు చాలా కాలంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ధరలు సుమారు రూ.6.26 లక్షల నుంచి రూ.9.32 లక్షల వరకు ఉన్నాయి.

4.హ్యుందాయ్ ఎక్స్టర్

Advertisement

హ్యుందాయ్ ఎక్స్టర్ మంచి ఫీచర్లతో కూడిన మైక్రో SUVగా గుర్తింపు పొందింది. ఇందులో స్మార్ట్ ఆటో AMT గేర్‌ బాక్స్ అందిస్తున్నారు. సన్‌ రూఫ్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ యువతను ఆకట్టుకుంటుంది. ధరలు రూ.6.13 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఉన్నాయి.

5.హోండా అమేజ్

ఈ జాబితాలో ఉన్న కార్లలో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ ను అందిస్తున్న ఏకైక మోడల్ హోండా అమేజ్. CVT కారణంగా డ్రైవింగ్ చాలా స్మూత్‌ గా ఉంటుంది. నగర ట్రాఫిక్‌ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపవచ్చు. విశాలమైన ఇంటీరియర్, మంచి కంఫర్ట్ లెవెల్స్ ఈ సెడాన్‌ కు అదనపు అడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు. దీని ధరలు రూ.7.93 లక్షల నుంచి రూ.9.86 లక్షల వరకు ఉన్నాయి.

Read Also: స్కోడా కార్లపై భారీ ఆఫర్లు.. స్లావియాపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×