E-Paper
Advertisement

Bajaj Qute EV: జస్ట్ రూ.3 లక్షల్లో ఎలక్ట్రిక్ 4 వీలర్.. బజాజ్ నుంచి క్యూట్ EV వచ్చేస్తోంది!

Bajaj Qute EV: జస్ట్ రూ.3 లక్షల్లో ఎలక్ట్రిక్ 4 వీలర్.. బజాజ్ నుంచి క్యూట్ EV వచ్చేస్తోంది!
Advertisement

Bajaj Qute EV Launch Soon: దేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ ను బజాజ్ కంపెనీ తీసుకురాబోతోంది.  క్యూట్ ఈవీ పేరుతో త్వరలో మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఆటోరిక్షా తరహాలో రూపొందించిన బజాజ్ క్యూట్ CNG, LPG వాహనాలను విడుదల చేసిన బజాజ్ ఆటో, ఇప్పుడు అదే మోడల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌ లో తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త ఈవీ ధర సుమారు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇటీవల ఈ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ది యూనిక్ షాడో అనే ఇన్‌ స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. చిన్న కుటుంబాలకు సరిపోయే లో కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానున్నట్లు వీడియోలో వివరించారు.

చిన్న సైజు.. నాలుగు డోర్లు

Advertisement

బజాజ్ క్యూట్ ఈవీ బయట నుంచి చూస్తే చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ, నాలుగు డోర్లతో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో హాలోజన్ హెడ్‌ లైట్లు, మ్యాట్ బ్లాక్ బంపర్, కూలింగ్ కోసం వెంట్స్ ఉన్నాయి. చిన్న సైజ్ కారణంగా ఒకే వైపర్‌ ను మాత్రమే విండ్ షీల్డ్‌ కు అమర్చారు. పైభాగంలో రూఫ్ క్యారియర్ కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్‌ లో బ్లాక్ క్లాడింగ్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, మాన్యువల్ ORVMలు కనిపిస్తాయి. లోపల సింపుల్ డిజైన్ ఉన్న డాష్‌ బోర్డ్ కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్‌ పై  Qute బ్యాడ్జ్ ఉంటుంది. స్పీడ్, బ్యాటరీ లెవెల్ వివరాలు చూపించే డిజిటల్ డిస్‌ ప్లే కూడా ఉంటుంది.

ఇక డ్రైవ్, పార్క్, రివర్స్ మోడ్‌ ల కోసం ప్రత్యేక సెలెక్టర్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ లో కాస్ట్ ఈవీలో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. అలాగే AC సిస్టమ్ కూడా ఉంటుంది. ముందు భాగంలో కూలింగ్ కంట్రోల్స్ ఉండగా, వెనుక ప్రయాణికులకు కూడా గాలి అందేందుకు పైభాగంలో ఫ్యాన్ తరహా సెటప్ ఇచ్చారు.

నలుగురు ప్రయాణించే అవకాశం

Advertisement

ఈ స్మాల్ ఈవీ నలుగురు సౌకర్యంగా ప్రయాణించడానికి సరిపోతుంది. వెనుక సీట్లకు కూడా సీట్‌ బెల్ట్స్ ఉన్నాయి. చిన్న కుటుంబాలు, నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే, కంపెనీ ఇప్పటి వరకు బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, మోటార్ పవర్ లాంటి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ వాహనం రోడ్ టెస్టింగ్ దశలో ఉంది. హోమోలోగేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ పూర్, మహారాష్ట్రలోని ముంబై డీలర్ వర్గాల ప్రకారం, మరికొన్ని వారాల్లో బజాజ్ క్యూట్ ఈవీ అధికారికంగా విడుదల కావచ్చు. తక్కువ ధరలో ఫోర్ వీలర్ EV కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. చిన్న పరిమాణం, తక్కువ ధర, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలమైన డిజైన్ కారణంగా బజాజ్ క్యూట్ ఈవీ భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశముంది.

Read Also: 8 ఏండ్ల బ్యాటరీ వారంటీ.. ఈవీ కొనాలంటే ఇవే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×