// // Bajaj Pulsar NS400Z: పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, కొత్త ఇంజన్‌తో NS400Z వచ్చేసింది! -->
E-Paper
Advertisement

పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, కొత్త ఇంజన్‌తో NS400Z వచ్చేసింది!

పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, కొత్త ఇంజన్‌తో NS400Z వచ్చేసింది!
Advertisement

New Pulsar NS400Z Launched:  బజాజ్ ఆటో తన పాపులర్ నేకెడ్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ NS400Zను కొత్త ఇంజన్‌ తో అప్‌ డేట్ చేసింది. కంపెనీ ఎలాంటి ప్రకటన లేకుండా తన అధికారిక వెబ్‌ సైట్‌ లో ఈ మార్పుల గురించి కీలక వివరాలు వెల్లడించింది. ఈ బైక్ లో కొత్త అప్ డేట్ చేసినప్పటికీ, ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ మోడల్ ప్రస్తుతం రూ. 1,93,900కే అందుబాటులోకి వచ్చింది.

349cc ఇంజిన్ తో పల్సర్ NS400Z

ప్రస్తుతం పల్సర్ NS400Z  బైక్‌ లో 349cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అందిస్తున్నారు. ఈ ఇంజన్ 9,000 rpm దగ్గర 40 bhp పవర్‌ ను, 7,500 rpm దగ్గర 33.2 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. గతంలో ఉన్న 373cc ఇంజన్‌తో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ అవుట్‌ పుట్ ఇస్తున్నా, మొత్తం పనితీరు మాత్రం సమానంగా ఉండేలా ట్యూన్ చేశారు. నిజానికి, ఈ బైక్ మొదట విడుదలైనప్పుడు ఉన్న పవర్ ఫిగర్లను దాదాపు అలాగే కొనసాగించారని చెప్పొచ్చు.

Advertisement

ఈ కొత్త ఇంజన్ డిజైన్ ఇటీవల అప్‌డేట్ అయిన బజాజ్ డొమినార్ 400 ఇంజన్‌ కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఇంజన్‌లో బోర్ సైజ్‌ను అలాగే ఉంచి, స్ట్రోక్‌ ను కొంచెం తగ్గించడం ద్వారా పనితీరులో మార్పులు తీసుకువచ్చినట్లు సమాచారం. దీని వల్ల పవర్ డెలివరీ మరింత స్మూత్‌ గా, వినియోగానికి అనుకూలంగా ఉండేలా మార్పులు చేశారు.

ఇతర భాగాల్లో నో ఛేంజెస్

ఇంజన్ తప్పితే, బైక్‌లో ఇతర భాగాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికీ అదే పెరిమీటర్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. సస్పెన్షన్ విషయంలో ముందువైపు ఇన్వర్టెడ్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ అందించారు. వీల్స్ విషయానికి వస్తే, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇరువైపులా ఉన్నాయి. ఇవి రోడ్ గ్రిప్, స్టెబిలిటీని మెరుగుపరుస్తాయి.

Advertisement

బ్రేకింగ్ వ్యవస్థలో కూడా ఎలాంటి మార్పు లేదు. ముందువైపు 320mm డిస్క్, వెనుకవైపు 230mm డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ABS అందించారు. రైడింగ్ సమయంలో భద్రతను పెంచడంలో సహాయపడుతుంది.

మొత్తంగా ఈ అప్‌డేట్ ద్వారా బజాజ్ బైక్ పనితీరును సర్దుబాటు చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త ఇంజన్‌తో కొంత మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకువచ్చారు. ధరను అదే స్థాయిలో ఉంచడం వల్ల, ఈ సెగ్మెంట్‌లో ఇది ఇంకా ఆకర్షణీయమైన ఆప్షన్ గా కొనుగోలుదారులకు కనిపించే అవకాశం ఉంది.

Read Also: స్కోడా కార్లపై బంపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×