E-Paper
Advertisement

బజాజ్ నుంచి స్టైలిష్ అప్‌డేట్, ‘బ్లాక్ గోల్డ్’ కలర్‌ తో పల్సర్ 150!

బజాజ్ నుంచి స్టైలిష్ అప్‌డేట్,  ‘బ్లాక్ గోల్డ్’ కలర్‌ తో పల్సర్ 150!
Advertisement

Bajaj Pulsar 150 Black Gold Edition: బజాజ్ పాపులర్ బైక్ పల్సర్ 150కి కొత్త లుక్ ను యాడ్ చేసింది. ‘బ్లాక్ గోల్డ్’ అనే ఈ కొత్త కలర్ స్కీమ్ బైక్‌కు మరింత ప్రీమియం లుక్ తీసుకొచ్చింది. మొత్తం బైక్ బ్లాక్ కలర్‌ లో ఉండగా, కొన్ని ముఖ్యమైన భాగాలపై గోల్డ్ టచ్ ఇవ్వడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హెడ్‌ లైట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్, టెయిల్ భాగం, వీల్ రిమ్స్, ఇంజిన్ కౌల్స్ పై గోల్డెన్ డిజైన్‌ లు బైక్‌ కు మరింత క్రేజీ లుక్ వచ్చింది.

ఇతర పల్సర్ మోడల్స్ కు కూడా..

ఈ కొత్త కలర్  పల్సర్ 150కే పరిమితం కాలేదు. ఇదే ‘బ్లాక్ గోల్డ్’ థీమ్‌ను పల్సర్ 125 మరియు ఇటీవల మార్కెట్లోకి వచ్చిన పల్సర్ 180 మోడళ్లలో కూడా బజాజ్ అందిస్తోంది. దీంతో ఈ సిరీస్ మొత్తం ఒకే స్టైల్‌ లో కనిపించేలా కంపెనీ ప్రయత్నించింది. ఇక పల్సర్ 150లో ఇప్పటికే ఉన్న ఐదు కలర్ ఆప్షన్లకు అదనంగా ఈ కొత్త షేడ్ కూడా చేరింది. గత ఏడాది డిసెంబర్‌ లో పల్సర్ 150కు కొన్ని కాస్మెటిక్ అప్‌ డేట్స్ చేసింది.  అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు ఈ కొత్త కలర్‌ ను పరిచయం చేసింది. అయితే, ఈ మార్పులు కేవలం డిజైన్ కే పరిమితం అయ్యాయి. బైక్ పనితీరు, ఇంజిన్ విషయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

పల్సర్ 150 ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ పరంగా చూస్తే, పల్సర్ 150లో మునుపటిలానే 149.5 సీసీ సామర్థ్యం కలిగిన ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది.  సుమారు 13.8 బిహెచ్‌పీ పవర్, 13.25 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌ బాక్స్ జత చేయబడింది. సిటీ రైడింగ్‌ కు, డైలీ యూజ్‌ కు ఈ సెటప్ అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేసిక్ సింగిల్ డిస్క్ వేరియంట్ ధర సుమారు రూ. 1.10 లక్షలుగా ఉంది.  సింగిల్ డిస్క్ యూజీ వేరియంట్ కొంచెం ఎక్కువగా రూ. 1.13 లక్షల ధరను కలిగి ఉంది. ఇక టాప్ వేరియంట్ ట్విన్ డిస్క్ మోడల్ ధర సుమారు రూ. 1.17 లక్షలుగా కొనసాగుతోంది.

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, సింగిల్ డిస్క్ వేరియంట్లలో 31 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. వీటిలో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ముందువైపు 80 సెక్షన్ టైర్, వెనుకవైపు 100 సెక్షన్ టైర్ ఉపయోగిస్తారు. బ్రేకింగ్ కోసం ముందు వైపు 260 మిమీ డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంది. టాప్ వేరియంట్‌ లో మాత్రం మరింత మెరుగైన సెటప్ ఉంటుంది. ఇందులో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, పెద్ద టైర్లు, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ముందువైపు 280 మిమీ, వెనుకవైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉండడం వల్ల బ్రేకింగ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

Advertisement

Read Also: లో కాస్ట్, హై రేంజ్.. ఇది స్కూటర్ కాదు, ఫ్యూచర్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×