E-Paper
Advertisement

చేతక్ ఈవీలో క్రేజీ అప్ డేట్స్.. కొత్త మోడల్స్ వచ్చేశాయ్!

చేతక్ ఈవీలో క్రేజీ అప్ డేట్స్.. కొత్త మోడల్స్ వచ్చేశాయ్!
Advertisement

New Bajaj Chetak C25, C30, C35 Models Launched: ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బజాజ్ చేతక్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ స్కూటర్ కు కొత్త అప్ డేట్స్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్లలో ఫీచర్లు, పనితీరు, అలాగే మోడళ్ల పేర్లలో కూడా మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ లైనప్ లో C సిరీస్ అందుబాటులోకి వచ్చింది. C25, C30, C35 అనే మూడు ప్రధాన మోడళ్లను తీసుకొచ్చింది.

కొత్త మోడల్స్ గురించి..

తాజాగా తీసుకొచ్చిన వాటిలో ఫ్లాగ్‌ షిప్ మోడల్ అయిన C35 01 ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ ను నేరుగా ఉపయోగించుకునే సదుపాయం కల్పించారు. ప్రయాణ సమయంలో రూట్ మ్యాపింగ్ మరింత ఈజీగా ఉంటుంది. ఇక మొత్తం సిరీస్‌ లో ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఇప్పటి వరకు ఉన్న మోడళ్లతో పోలిస్తే కొత్త వెర్షన్లు మరింత వేగంగా నడుస్తాయి. C35 01, C35 02 మోడళ్లు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు ఈ వేగం 73 కిలోమీటర్ల వరకు ఉండేది. C35 03, C30 01 మోడళ్లు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ఎంట్రీ లెవల్ మోడల్ అయిన C25 01 మాత్రం 60 కిలో మీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది.

మోటార్ సామర్థ్యం పెంపు

Advertisement

ఫ్లాగ్‌ షిప్ మోడల్‌ లో మోటార్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. గతంలో4.5 కిలోవాట్ల పవర్ కలిగిన మోటార్ ఉండగా, ఇప్పుడు అది 4.8 కిలోవాట్లకు పెరిగింది. ఇకపై ఈ స్కూటర్ మరింత చురుగ్గా స్పందిస్తుంది. వేగంగా పికప్ ఇవ్వడం, స్మూత్ రైడింగ్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇక చార్జింగ్ విషయానికొస్తే, C30 01 మోడల్‌ లో చాలా మార్పులు చేశారు. గతంలో 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ కావడానికి దాదాపు 3 గంటలు 50 నిమిషాలు పట్టేది. ఇప్పుడు కేవలం 2 గంటలు 55 నిమిషాల్లో పూర్తవుతుంది. రోజువారీ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

ఈ స్కూటర్లలో ఎకో, స్పోర్ట్ రైడ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే C35, C30 సిరీస్‌ లో హిల్ హోల్డ్ అసిస్ట్‌ ను ఇప్పుడు స్టాండర్డ్ ఫీచర్‌ గా ఇచ్చారు. ఇక C35 01, C35 02 మోడళ్లు ఓవర్ ది ఎయిర్ అప్‌ డేట్స్‌ కు సపోర్ట్ చేస్తాయి. దీని ద్వారా వినియోగదారులు సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్‌ ను సులభంగా పొందగలరు.

Advertisement

తాజా అప్‌ డేట్స్‌ తో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ మరింత మోడర్న్ గా, వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఫీచర్లు, అత్యధిక వేగం, తక్కువ చార్జింగ్ టైమ్ లాంటి అంశాలు ఈ స్కూటర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ మోడళ్లను అధికారిక డీలర్‌ షిప్‌ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. త్వరలోనే వీటి డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

Read Also: స్టైలిష్ లుక్‌ తో SR GT 200.. కొత్త కలర్ ఏముంది భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×