E-Paper
Advertisement

స్ట్రీట్ 160 ఆఫ్, స్ట్రీట్ 220 ఆన్.. బజాజ్ ప్లాన్ అదిరింది భయ్యా!

స్ట్రీట్ 160 ఆఫ్, స్ట్రీట్ 220 ఆన్.. బజాజ్ ప్లాన్ అదిరింది భయ్యా!
Advertisement

Avenger Lineup Update: భారతీయ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ అవెంజర్ సిరీస్‌ లో మరో మోడల్‌ ను తిరిగి మార్కెట్‌ లోకి తీసుకురాబోతోంది. అవెంజర్ స్ట్రీట్ 220 పేరుతో ఈ క్రూజర్ బైక్ త్వరలోనే దేశీ మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ మోడల్ గురించి ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌ సైట్‌ లో లిస్ట్ చేసింది. రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా, ఈ నెల చివర్లోనే ఈ బైక్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ధర ఎంత అంటే?

ఇప్పటికే మార్కెట్లో ఉన్న బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 ధర రూ. 1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. దీనితో పోలిస్తే, రాబోయే స్ట్రీట్ 220 మోడల్ ధర కొద్దిగా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. స్ట్రీట్ వెర్షన్ సాధారణంగా సింపుల్ డిజైన్, తక్కువ ఫీచర్లతో వస్తుంది. సో, ధర కూడా కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్ డిస్ కంటిన్యూ

Advertisement

అటు బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్‌ ను కంపెనీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ బైక్ అధికారిక వెబ్‌ సైట్‌ లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అవెంజర్ సిరీస్‌ లో అందుబాటులో ఉన్న మోడళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు వెబ్‌ సైట్‌ లో కనిపిస్తున్నవి 220 క్రూజ్, 220 స్ట్రీట్ మోడళ్లే.

ఇంజిన్ గురించి..

కొత్త అవెంజర్ స్ట్రీట్ 220లో క్రూజ్ 220లో ఉన్న ఇంజన్‌ ను ఉపయోగించారు. ఇది 220cc సామర్థ్యం కలిగిన ఎయిర్,  ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అందించారు. ఈ మోటార్ 8,500 rpm వద్ద సుమారు 19 bhp శక్తిని, 7,000 rpm వద్ద 17.6 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్మూత్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.

డిజైన్ ఎలా ఉంటుందంటే?

Advertisement

డిజైన్ విషయంలో స్ట్రీట్ 220.. క్రూజ్ 220తో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా, హ్యాండిల్‌ బార్ తక్కువ ఎత్తులో ఉండేలా తయారు చేశారు. ఇది రైడర్‌కు మరింత కంఫర్ట్, కంట్రోల్‌ ను అందిస్తుంది. సిటీ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటుంది.  ఈ మోడల్‌ లో పిలియన్ బ్యాక్‌ రెస్ట్ ఇవ్వలేదు. క్రూజ్ మోడల్‌ లో కనిపించే పొడవైన విండ్‌ షీల్డ్ స్థానంలో చిన్న సైజ్ వైజర్‌ ను అమర్చారు. ఇది బైక్‌కు స్పోర్టీ లుక్ ఇస్తుంది. ఈ బైక్‌లోని ఛాసిస్, ఇతర భాగాలకు బ్లాక్-అవుట్ ఫినిష్ ఇవ్వడం ద్వారా మరింత అందంగా తీర్చిదిద్దారు. మొత్తం మీద స్ట్రీట్ 220 డిజైన్, యూత్, అర్బన్ రైడర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ బైక్ ఎబోనీ బ్లాక్, కాక్‌ టెయిల్ వైన్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది.  లభించనుంది.

Read Also: యమహా బైక్ ధరలు పెంపు, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×