E-Paper
Advertisement

రూ. 5 వేల లోపు బెస్ట్ హెల్మెట్లు.. సేఫ్టీతో పాటు స్టైల్ కూడా!

రూ. 5 వేల లోపు బెస్ట్ హెల్మెట్లు.. సేఫ్టీతో పాటు స్టైల్ కూడా!
Advertisement

Safest Budget Helmets 2026: బైక్ రైడింగ్‌ లో హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. కేవలం ట్రాఫిక్ చలాన్స్ నుంచి తప్పించుకోవడం కోసం పెట్టుకునే వస్తువు కాదు. రైడర్ ప్రాణాలను కాపాడే అత్యంత ముఖ్యమైన యాక్సెసరీ. ప్రస్తుతం మార్కెట్‌ లో చాలా రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి భద్రతతో పాటు తక్కువ ధరలో హెల్మెట్ కొనాలని చాలా మంది చూస్తుంటారు. రూ. 5,000 లోపు మంచి క్వాలిటీ హెల్మెట్ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ Axor Apex

రూ. 5 వేల లోపు బడ్జెట్‌లో బెస్ట్ హెల్మెట్ ఆక్సోర్ అపెక్స్. ఈ హెల్మెట్‌ లో హై ఇంపాక్ట్ పాలికార్బోనేట్ షెల్ ఉండటంతో ప్రమాద సమయంలో తలకు మంచి రక్షణ లభిస్తుంది. డ్యూయల్ వైజర్ సిస్టమ్ ఉండటం వల్ల ఎండలో కూడా సౌకర్యంగా రైడ్ చేయవచ్చు. దీనికి DOT, ECE సర్టిఫికేషన్ ఉండటం భద్రత పరంగా మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది.

⦿  SMK Stellar, Typhoon

Advertisement

మంచి సౌకర్యం కావాలనుకునే వారికి SMK స్టెల్లార్, టైఫూన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఈ హెల్మెట్లు యూరోపియన్ స్టైల్ డిజైన్‌ తో ఆకట్టుకుంటాయి. లోపలి కుషన్లు మృదువుగా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించినా సౌకర్యంగా ఉంటుంది. వీటిలోని వైజర్ రోడ్డుపై స్పష్టమైన విజిబిలిటీ అందిస్తుంది.  ECE 22.06 భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.

⦿ MT Thunder 3 Pro

భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారికి MT థండర్ 3 Pro మంచి ఆప్షన్‌. ఈ హెల్మెట్ బలమైన నిర్మాణంతో వస్తుంది. ప్రమాద సమయంలో ఈజీగా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ రిలీజ్ చీక్ ప్యాడ్స్ అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ప్రమాద పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి సులభంగా హెల్మెట్ తీసే అవకాశం ఉంటుంది.

⦿ Axxis Draken, NHK K5R

Advertisement

బడ్జెట్ పరంగా మరింత తక్కువ ధరలో మంచి హెల్మెట్ కావాలనుకునే వారికి ఆక్సిస్ డ్రాకెన్ బాగుంటుంది. తక్కువ ధరలోనే సరైన భద్రత, మంచి డిజైన్ తో వస్తుంది. NHK K5R కూడా ఈ ధరలో మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.

హెల్మెట్ కొనేటప్పుడు ఏం చూడాలి?

⦿  హెల్మెట్ కొనేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే కాకుండా భద్రతా సర్టిఫికేషన్‌లను తప్పనిసరిగా పరిశీలించాలి. ISI, DOT, ECE 22.05, ECE 22.06 లాంటి గుర్తులు ఉండటం చాలా ముఖ్యం. ఇవి హెల్మెట్ నాణ్యతను సూచిస్తాయి.

⦿ రూ. 5 వేలలోపు ధరలో లభించే చాలా హెల్మెట్ల బరువు సుమారు 1600 గ్రాముల వరకు ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్న హెల్మెట్లు పొడవైన ప్రయాణాల్లో మెడ నొప్పికి కారణమవుతాయి. కాబట్టి ఫిట్‌, బరువు రెండూ చూసుకోవాలి.

⦿ మరో ముఖ్యమైన విషయం పిన్‌లాక్ రెడీ వైజర్. వర్షాకాలంలో, చల్లని వాతావరణంలో వైజర్‌పై పొగ మబ్బులు ఏర్పడకుండా ఇది సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఉంటే ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.

Read Also: స్కోడా కోడియాక్ అప్‌ డేట్‌ To కియా ఈవీ.. పెరిగిన ఇంధన ధరలే ఈ వీక్ హాట్ ఆటో టాపిక్స్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×