E-Paper
Advertisement

ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!
Advertisement

Avor Electric Bike 2026: అహ్మదాబాద్‌కు చెందిన సమర్థ్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన అవోర్ ఎలక్ట్రిక్ బైక్ భారత మార్కెట్లోకి త్వరలో అడుగుపెట్టనుంది. ఈ బైక్ EX/2S పేరుతో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీమియం 125cc నుంచి 200cc పెట్రోల్ బైక్‌ లకు ప్రత్యామ్నాయంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

జూలై 28న మార్కెట్ లోకి విడుదల

అవోర్ ఎలక్ట్రిక్ బైక్ జూలై 28న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 1.50 లక్షలుగా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ బైక్‌ను పూర్తిగా భారత్ లోనే అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ గా కంపెనీ ప్రచారం చేస్తోంది. ఇందులో ఉపయోగించిన సాంకేతిక వ్యవస్థలను కంపెనీ స్వయంగా రూపొందించినట్లు చెబుతోంది. దీంతో పనితీరు,  నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బైక్‌లో 10.5 kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ ను అందించనున్నారు. ఇది సుమారు 14 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పనితీరు పరంగా చూస్తే, 150cc పెట్రోల్ బైక్‌లకు సమానమైన అనుభూతిని అందించేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

బ్యాటరీ, రేంజ్ గురించి..

Advertisement

అవోర్ ఎలక్ట్రిక్ బైక్ లో 5 kWh సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించారు. ఇది IP67 రేటింగ్‌తో రావడం వల్ల దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ పొందుతుంది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేందుకు థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఇందులో అమర్చారు. ఈ బైక్ పూర్తి ఛార్జ్‌ తో సుమారు 250 నుంచి 260 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. టీజర్‌లో 82 శాతం బ్యాటరీ వద్ద 215 కిలోమీటర్ల మిగిలిన రేంజ్ కనిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్‌లకు కూడా ఈ రేంజ్ ఉపయోగపడే అవకాశం ఉంది.

 ఆకట్టుకునే డిజైన్

డిజైన్ పరంగా చూస్తే, ఈ బైక్ స్పోర్టీ నేకెడ్ స్ట్రీట్‌ ఫైటర్ స్టైల్‌లో కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ రెడ్ సిల్వర్ కలర్ స్కీమ్, స్ప్లిట్ సీట్లు, మస్కులర్ ట్యాంక్ డిజైన్, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ దీనికి క్రేజీ లుక్ ను ఇస్తున్నాయి. LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్, DRLs, T షేప్ LED టెయిల్ లైట్, అదనపు LED యాక్సెంట్ లైట్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

ఏఐ టెక్నాలజీతో అందుబాటులోకి!

Advertisement

ఈ బైక్‌లో Avor Sense AI అనే స్మార్ట్ టెక్నాలజీని కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది రైడింగ్ విధానాన్ని విశ్లేషించి రియల్‌ టైమ్ రైడ్ డేటా, ట్రిప్ వివరాలు, మెయింటెనెన్స్ అలర్ట్స్ అందిస్తుంది. అవసరమైతే కొన్ని రైడింగ్ సెట్టింగ్స్ ను ఆటోమేటిక్ గా సర్దుబాటు చేసే సామర్థ్యం కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ బైక్ రివోల్ట్ RV400, ఓబెన్ రోర్ ఎవో, ఓలా రోడ్‌స్టర్ లాంటి ఎలక్ట్రిక్ బైక్ లను గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: అల్ట్రావయోలెట్ To వెస్పా.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×