E-Paper
Advertisement

105 కి.మీ రేంజ్‌ తో క్రేజీ ఎలక్ట్రిక్ సైకిల్.. కిలో మీటర్‌ జస్ట్ 10 పైసలే!

105 కి.మీ రేంజ్‌ తో క్రేజీ ఎలక్ట్రిక్ సైకిల్.. కిలో మీటర్‌ జస్ట్ 10 పైసలే!
Advertisement

Avoki Street Series Electric Cycles: ఆవోకి స్ట్రీట్ సిరీస్ ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇటీవల భారత మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ మాంబా, స్ట్రీట్ ఘోస్ట్ లాంటి యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. మంచి లుక్, ఎలక్ట్రిక్ బైక్ లాంటి డిజైన్, ఎక్కువ రేంజ్ తో ఆకట్టుకుంటున్నాయి. సాధారణ ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోలిస్తే ఇవి మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి. రోజువారీ ప్రయాణాలకు, చిన్న ట్రిప్‌ లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి.

ఒకే ఛార్జ్ తో 105 కి.మీ ప్రయాణం

ఈ ఇ సైకిళ్లలో 48V సామర్థ్యంతో కూడిన 15.6Ah నుంచి 15.8Ah వరకు బ్యాటరీ ప్యాక్‌ ను అందిస్తున్నారు. బ్యాటరీని అవసరమైతే తీసి ఇంట్లో, ఆఫీస్ లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం, పెడల్ అసిస్ట్ మోడ్‌ లో ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 105 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం థ్రాటిల్ మోడ్‌ ను ఉపయోగిస్తే సుమారు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది.

గంటకు 25 కి.మీ గరిష్ట వేగం

Advertisement

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో 250W BLDC హబ్ మోటార్‌ను అందించారు. ఇది నగర ప్రయాణాలకు సరిపడా పవర్ ను కలిగి ఉంటుంది. భారత నిబంధనలకు అనుగుణంగా దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అందువల్ల దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.

అత్యాధునిక ఫీచర్లు

భద్రత కోసం ముందు, వెనుక భాగాల్లో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌ లను అమర్చారు. అలాగే ముందు సస్పెన్షన్‌ తో పాటు డ్యూయల్ రియర్ సస్పెన్షన్ కూడా ఉండటంతో గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 20×4.0 సైజు ఫ్యాట్ టైర్లు మంచి గ్రిప్‌ను అందిస్తాయి. ఇందులో షిమానో 7 స్పీడ్ గేర్ సిస్టమ్, రంగుల LCD డిస్‌ ప్లే, LED హెడ్‌ లైట్లు, టర్న్ ఇండికేటర్లు లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇది సాధారణ సైకిల్ కంటే ఒక మినీ ఎలక్ట్రిక్ బైక్‌ లా అనిపిస్తుంది.

ధర ఎంత? రన్నింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది?

Advertisement

ధరల విషయానికి వస్తే, మోడల్‌ను బట్టి వీటి ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.59,990 నుంచి రూ.62,999 మధ్య ఉంటుంది.  ఆవోకి ఇ-సైకిల్‌లోని బ్యాటరీ సామర్థ్యం సుమారు 0.75 kWh వరకు ఉంటుంది. ఒక పూర్తి ఛార్జ్‌ కు సగటున 1 యూనిట్ కంటే తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. ఇంటి విద్యుత్ చార్జీ యూనిట్‌కు రూ.8 చొప్పున లెక్కిస్తే, ఒకసారి పూర్తి ఛార్జ్ చేయడానికి సుమారు రూ.6 నుంచి రూ.8 మాత్రమే ఖర్చవుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే, కిలోమీటర్‌కు ఖర్చు 8 నుంచి 10 పైసల మధ్య మాత్రమే ఉంటుంది. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే రోజూ ఆఫీస్, కాలేజ్, నగర ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునేవారికి ఆవోకి స్ట్రీట్ సిరీస్ ఎలక్ట్రిక్ సైకిళ్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

Read Also: టీవీఎస్ To బజాజ్.. దేశంలో అత్యంత నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×