E-Paper
Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్లాడితే వింటుంది.. చెప్పింది చేస్తుంది.. నిజంగా వండర్ భయ్యా!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్లాడితే వింటుంది.. చెప్పింది చేస్తుంది.. నిజంగా వండర్ భయ్యా!
Advertisement

Ather Voice Assistant Feature: ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు మరో కొత్త స్మార్ట్ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ‘వాయిస్ ఆన్ ఏథర్’తో వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ ఫీచర్  జెన్-3, ఆ తర్వాతి హార్డ్‌ వేర్‌ తో వచ్చిన అన్ని స్కూటర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ అధికారికంగా ప్రకటించింది.

ఏథర్‌ స్టాక్ 7 సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్‌ లో భాగంగా..

ఈ ఫీచర్‌ను మొదటిసారిగా ఏథర్ కమ్యూనిటీ డే 2025లో పరిచయం చేశారు. అనంతరం ఏథర్‌ స్టాక్ 7 సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్‌ లో భాగంగా వినియోగదారులకు అందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌ డేట్ ద్వారా అర్హత కలిగిన స్కూటర్లలో ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతోంది.

ఏంటీ ‘వాయిస్ ఆన్ ఏథర్’ ప్రత్యేకత?

Advertisement

‘వాయిస్ ఆన్ ఏథర్’ ప్రత్యేకత ఏమిటంటే, ఇది గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ సిరి మాదిరిగా పని చేస్తుంది. రైడర్లు తమ స్కూటర్‌ తో నేరుగా మాట్లాడి తమకు నచ్చినట్లుగా పని చేయించుకోవచ్చు. ప్రత్యేక కమాండ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సాధారణ సంభాషణ మాదిరిగానే ఆదేశాలు ఇవ్వొచ్చు. ఈ ఫీచర్  లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారిత టెక్నాలజీ ద్వారా పని చేస్తోంది. భారతీయ వినియోగదారుల యాసలు, మాండలికాలు, మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకునేలా ఈ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారులు సహజమైన భాషలో ప్రశ్నలు అడిగినా, ఆదేశాలు ఇచ్చినా స్కూటర్ స్పందిస్తుంది.

నాలుగు విభాగాల్లో పని చేసేలా..

ప్రస్తుతం ఈ వాయిస్ సిస్టమ్ నాలుగు ప్రధాన విభాగాల్లో పనిచేస్తోంది. వాటిలో నావిగేషన్, వాహన సెట్టింగ్స్, కాల్స్,  నోటిఫికేషన్లు, మీడియా కంట్రోల్స్ ఉన్నాయి.  “దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది?”, “ఆఫీసుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?” లాంటి ప్రశ్నలు అడగవచ్చు. అలాగే “స్క్రీన్ బ్రైట్‌ నెస్ పెంచు”, “ట్రాక్షన్ కంట్రోల్‌ను రెయిన్ మోడ్‌ కు మార్చు”  లాంటి ఆదేశాలు కూడా ఇవ్వవచ్చు. ఈ ఫీచర్ ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్‌ తో పని చేయడమే కాకుండా, ఇతర బ్లూటూత్ హెడ్‌ సెట్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే సేనా, కార్డో లాంటి థర్డ్ పార్టీ ఇంటర్‌ కామ్, బ్లూటూత్ పరికరాలను ఉపయోగించే రైడర్లు కూడా ఈ సౌకర్యాన్ని పొందుతారు.

Advertisement

భవిష్యత్తులో ఈ ఫీచర్‌ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం రైడర్ ఇచ్చే ఆదేశాలకు మాత్రమే స్పందిస్తున్న స్కూటర్, రాబోయే అప్‌ డేట్లలో స్వయంగా రైడర్‌ తో మాట్లాడే స్థాయికి చేరుకోనుంది. రోడ్డుపై గుంతలు ఉంటే ముందుగానే హెచ్చరించడం, టైర్ ప్రెజర్ తక్కువగా ఉంటే సమాచారం ఇవ్వడం, పార్క్ చేసిన వాహనం గురించి అలర్ట్స్ పంపించడం లాంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చు. ‘వాయిస్ ఆన్ ఏథర్’ ఫీచర్ ప్రస్తుతం 450X, 450 అపెక్స్, రిజ్టా Z మోడళ్లలో అందుబాటులో ఉంది. అయితే 450S, రిజ్టా S వేరియంట్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. దీనికి అవసరమైన హార్డ్‌వేర్ సపోర్ట్ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Read Also: పొట్టి రైడర్ల కోసం బెస్ట్ బైక్‌లు.. ఈజీగా నడిపే టాప్ మోడల్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×