E-Paper
Advertisement

Ather Rizta vs Honda Activa e: ఏథర్ రిజ్టా vs హోండా యాక్టివా ఇ.. వీటిలో ఏది కొంటే బెస్ట్?

Ather Rizta vs Honda Activa e: ఏథర్ రిజ్టా vs హోండా యాక్టివా ఇ.. వీటిలో ఏది కొంటే బెస్ట్?
Advertisement

Ather Rizta vs Honda Activa e Comparison: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఏథర్ రిజ్టా,  హోండా యాక్టివా ఇ సత్తా చాటుతున్నాయి. మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఏథర్ రిజ్టా ఎక్కువ దూరం (125 కి.మీ), రివర్స్ అసిస్ట్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. హోండా యాక్టివా ఇ 102 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.  ఇంతకీ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఏథర్ రిజ్టా గురించి..

⦿ బ్యాటరీ, రేజ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.9kWh, 3.7kWh బ్యాటరీ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది. 5 సంవత్సరాల వారంటీతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ మీద 125 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులో   4.3kW మోటార్ ఉంటుంది. గంటకు 80 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు TFT/LCD స్క్రీన్, బ్లూటూత్, Wi-Fi, యాప్ కనెక్టివిటీ, యాంటీ థెఫ్ట్ అలారం, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌ వర్క్ యాక్సెస్ ఉంటుంది. ఇందులో 34 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్‌ కు సరిపోతుంది. రివర్స్ అసిస్ట్, స్ప్రింగ్ లోడెడ్ ఛార్జింగ్ ఫ్లాప్ ఉంటుంది.

హోండా యాక్టివా ఇ గురించి..

⦿ బ్యాటరీ, రేంజ్:  హోండా యాక్టివా ఇ 3 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇందులో రెండు రిమూవబుల్ 1.5 kWh లిథియం అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటుంది.  ఇది ఒకే ఛార్జ్‌ మీద సుమారు 102 కి.మీ ప్రయాణించే అవకాశం ల్పిస్తుంది.  ఈ స్కూటర్ నగర ప్రయాణానికి రూపొందించబడింది. 80 కి.మీ/గం గరిష్ట వేగంతో వెళ్తుంది. ఇందులో 6 kW మోటారు ఉంటుంది.

Advertisement

⦿ లక్షణాలు: H-స్మార్ట్ కీ, రోడ్‌ సింక్ తో 7 అంగుళాల TFT డిస్ ప్లేను కలిగి ఉంటుంది. USB పోర్ట్, ఫ్రంట్ డిస్క్ తో వస్తుంది. యాక్టివా మాదిరిగానే సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించబడింది. బ్రాండ్ నమ్మకంతో పాటు యాక్టివా లుక్ వినియోగదారులలో ఆదరణ పెంచుతుంది.

Read Also: సుజుకి నుంచి దుమ్మురేపే స్పెషల్ ఎడిషన్ బైక్, లాంచింగ్ డేట్ ఫిక్స్!

ఏది కొంటే బెస్ట్?

ఒక వేళ ఎక్కువ బూట్ స్పేస్,  నావిగేషన్, రివర్స్ లాంటి టెక్నికల్ లక్షణాలు కావాలనుకుంటే, ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించడం, నగర ప్రయాణాలకు ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే ఏథర్ రిజ్టాను సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్.  ఒకవేళ బ్రాండ్ నమ్మకం కోసం ప్రధాన్యత ఇస్తే హోండా ఇని ఎంచుకోవడం మంచిది. పెద్ద మోటారు, మంచి పనితీరు, స్మార్ట్ ఫీచర్లతో కూడిన క్లాసిక్ యాక్టివా అనుభూతి కావాలంటే ఒకే చెయ్యొచ్చు. అయితే, బూట్ స్పేస్ అనుకున్న స్థాయిలో ఉండదు.  ఇంకా చెప్పాలంటే ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. హోండా యాక్టివా ఇ మాస్ అప్పీల్ ను కలిగి ఉంటుంది.

Read Also: ఎంజీ విండ్సర్ ఈవీ vs టాటా కర్వ్ ఈవీ.. ఈ రెండింటిలో ఏది తోపు అంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×