E-Paper
Advertisement

రూట్ మార్చిన ఏథర్.. జస్ట్ లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్!

రూట్ మార్చిన ఏథర్.. జస్ట్ లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్!
Advertisement

Ather’s Budget EV Scooter Coming Soon: దేశీ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో,  మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అనుకూలంగా ఉండే కొత్త ఈవీలను తీసుకొచ్చేందుకు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ దిశగా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఏథర్ ఎనర్జీ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ప్రీమియం స్కూటర్లకు మాత్రమే పరిమితమైన ఈ కంపెనీ, ఇప్పుడు మధ్య తరగతి వినియోగదారులను ఆకర్షించేలా చర్యలు చేపడుతోంది.

‘EL’ ప్లాట్‌ ఫారమ్‌ ఆధారంగా కొత్త ఈవీలు

ఏథర్ ఇప్పటికే దేశంలోని ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్‌ లో మంచి పొజిషన్ లో కొనసాగుతోంది. ఇప్పుడు, ఎక్కువ మంది ప్రజలు EVలను కొనుగోలు చేసుకుంటున్నారు. తక్కువ ధరలో మంచి క్వాలిటీతో స్కూటర్‌ ను అందించాలనే లక్ష్యంతో ‘EL’ అనే కొత్త ప్లాట్‌ ఫారమ్‌ ను రూపొందిస్తోంది. ఈ ప్లాట్‌ ఫారమ్ ప్రత్యేకంగా ఖర్చు తగ్గించే విధంగా డిజైన్  చేశారు.

జస్ట్ రూ. లక్షకే కొత్త ఈవీ

Advertisement

ప్రస్తుతం మార్కెట్‌ లో ఉన్న ఏథర్ స్కూటర్లు.. 450 సిరీస్, రిజ్టా లాంటి మోడళ్లు, ప్రీమియం సెగ్మెంట్‌ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు సుమారు రూ. 1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. కానీ, కొత్తగా రాబోయే ఈ బడ్జెట్ స్కూటర్ ధర సుమారు రూ. 1 లక్ష వరకు ఉండొచ్చని అంచనా. ఇది ఏథర్ నుంచి వచ్చే అత్యంత చవకైన మోడల్‌ కానుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపడే విధంగా దీనిని రూపొందించారు. ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా తయారు చేశారు.

టెక్నాలజీ విషయంలో నో కాంప్రమైజ్

ధర తగ్గించినా, టెక్నాలజీ విషయంలో ఏథర్ ఏమాత్రం ఎలాంటి రాజీ పడదని కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త స్కూటర్‌ లో  కనెక్టెడ్ ఫీచర్లు, సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్లు లాంటి సదుపాయాలు ఉండే అవకాశముంది. అంతేకాకుండా, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి సీటు, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ లాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనున్నారు. నగరాల్లో రోజువారీ ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

దేశంలో భారీగా పెరుగుతున్న ఈవీ వినియోగం

Advertisement

మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, పర్యావరణంపై అవగాహన లాంటి కారణాలతో చాలా మంది EVల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం టూ వీలర్ మార్కెట్‌ లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా ఎక్కువగా పెరిగింది. ఈ కంపెనీతో పాటు టీవీఎస్, బజాజ్, ఓలా లాంటి కంపెనీలు కూడా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఏథర్ తీసుకొస్తున్న కొత్త బడ్జెట్ స్కూటర్ మార్కెట్‌ లో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓలా S1X, TVS iQube, బజాజ్ చేతక్ లాంటి మోడళ్లతో ఇది పోటీ పడనుంది. తక్కువ ధరలో మంచి డిజైన్, ఆధునిక ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంటుంది.

Read Also: ఆలస్యం చేస్తే మిస్.. EV కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×