E-Paper
Advertisement

భారత ఈవీ మార్కెట్లో ఏథర్ దూకుడు.. 7 లక్షల సేల్ మార్క్ క్రాస్!

భారత ఈవీ మార్కెట్లో ఏథర్ దూకుడు.. 7 లక్షల సేల్ మార్క్ క్రాస్!
Advertisement

Ather Energy Hits New Sales Record: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ మరో కీలక మైలురాయిని దాటింది. కంపెనీ ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా స్కూటర్లను విక్రయించింది. వాహన్ డేటా ప్రకారం, జూన్ 25, 2026 నాటికి ఏథర్ మొత్తం 7,04,447 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థగా ఏథర్ నిలిచింది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో ఈ మైలురాయిని అందుకోగా, ఇప్పుడు ఏథర్ కూడా ఆ జాబితాలో చేరింది.

2018లో ఏథర్ అమ్మకాలు ప్రారంభం

2018లో కంపెనీ తన అమ్మకాలను ప్రారంభించింది. మొదట్లో అమ్మకాలు పెద్దగా లేకపోయినా, గత కొన్నేళ్లుగా కంపెనీ మోడల్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. గత ఎనిమిది నెలల వ్యవధిలోనే రెండు లక్షల స్కూటర్లను విక్రయించి వారెవ్వా అనిపించింది. 2021 వరకు కంపెనీ అమ్మకాలు నెమ్మదిగానే సాగాయి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022లో ఏథర్ తొలిసారిగా ఏడాదిలో 50 వేల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆ ఏడాది మొత్తం 54,769 స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2023లో ఈ సంఖ్య మరింత పెరిగి 1,11,812 యూనిట్లకు చేరుకుంది. 2024లో 1,36,513 యూనిట్లు విక్రయించగా, 2025లో కంపెనీ రికార్డు స్థాయిలో 2,14,985 స్కూటర్లను అమ్మింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 57 శాతం పెరుగుదల.

Advertisement

2025లో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఏథర్‌కు సుమారు 16 శాతం మార్కెట్ వాటా లభించింది. 2026లో కూడా కంపెనీ ఇదే జోరును కొనసాగిస్తోంది. జనవరి 1 నుంచి జూన్ 25 వరకు ఏథర్ ఇప్పటికే 1,63,788 యూనిట్లను అమ్మింది. 2025లో కంపెనీ సాధించిన మొత్తం అమ్మకాలలో 76 శాతానికి సమానం.  ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో అమ్ముడైన మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఏథర్ వాటా 17.53 శాతంగా ఉంది. మార్చి 2026 కంపెనీకి అత్యుత్తమ నెలగా నిలిచింది. ఆ ఒక్క నెలలోనే 36,362 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత తొమ్మిది నెలల్లో ఎనిమిది సార్లు నెలకు 20 వేలకుపైగా యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ప్రస్తుత విక్రయాల వేగాన్ని బట్టి చూస్తే, ఈ ఏడాది చివరి నాటికి ఏథర్ సుమారు 3.25 లక్షల యూనిట్లను అమ్మే అవకాశం కనిపిస్తోంది.

రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీ స్పందన

ఏప్రిల్ 2024లో మార్కెట్లోకి వచ్చిన రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ విజయానికి ప్రధాన కారణంగా మారింది. ప్రస్తుతం కంపెనీ నెలవారీ అమ్మకాలలో దాదాపు 75 శాతం వాటా ఈ ఒక్క మోడల్‌ దే. విడుదలైన కేవలం 25 నెలల్లోనే రిజ్తా అమ్మకాలు 3 లక్షల యూనిట్లను దాటాయి.  ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న ఏథర్, రాబోయే రోజుల్లో మరింత బలమైన స్థానాన్ని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Read Also: అల్ట్రావయోలెట్ To రివోల్ట్.. జూలైలో లాంచ్ కానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×