// // Ather 450X New Colours: కొత్త కలర్స్‌ తో క్రేజీగా ఏథర్ 450X.. ఛార్జింగ్ కూడా ఇక సూపర్ ఫాస్ట్! -->
E-Paper
Advertisement

కొత్త కలర్స్‌ తో క్రేజీగా ఏథర్ 450X.. ఛార్జింగ్ కూడా ఇక సూపర్ ఫాస్ట్!

కొత్త కలర్స్‌ తో క్రేజీగా ఏథర్ 450X.. ఛార్జింగ్ కూడా ఇక సూపర్ ఫాస్ట్!
Advertisement

Ather 450X India Update: ఇండియన్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే పాపులర్ మోడల్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కొత్త లుక్‌ తో తీసుకొచ్చింది. తాజాగా ఈ స్కూటర్‌ కు మూడు కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో పాటు మరింత వేగంగా ఛార్జింగ్ అయ్యే కొత్త 900W ఛార్జర్‌ ను కూడా స్టాండర్డ్‌ గా అందిస్తోంది. ఈ కొత్త మార్పులతో స్కూటర్ రూపం మరింత ఆకర్షణీయంగా మారినప్పటికీ, పనితీరు పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. భారత మార్కెట్లో ఏథర్ 450X ఎక్స్ షోరూమ్ ధర రూ.1.57 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

కొత్త రంగుల్లో అందుబాటులోకి ఏథర్ 450X

తాజాగా తీసుకొచ్చిన ఈ రంగులు ఓవర్‌ టోన్ సిరీస్ లో భాగంగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో స్టిల్ వైట్, స్పేస్ గ్రే, లూనార్ గ్రే అనే మూడు కొత్త కలర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. యువతతో పాటు స్టైలిష్ స్కూటర్ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కొత్త కలర్ ఆప్షన్స్ ను కంపెనీ పరిచయం చేసింది. స్టిల్ వైట్ కలర్ పూర్తిగా తెలుపు రంగుతో కనిపిస్తుంది. దీనిపై ఆకుపచ్చ, గ్రే కలర్ గ్రాఫిక్స్ ఉండటంతో స్కూటర్‌ కు ప్రత్యేకమైన స్పోర్టీ లుక్ వస్తుంది. సాధారణ వైట్ కలర్‌ తో పోలిస్తే ఇది మరింత ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. స్పేస్ గ్రే కలర్ కొంచెం డార్క్ థీమ్‌ లో ఉంటుంది. ఇందులో డార్క్ గ్రే కలర్ తో పాటు రెడ్, గ్రే కలర్ గ్రాఫిక్స్ ఇవ్వడం వల్ల స్కూటర్ మరింత స్టైలిష్‌ గా కనిపిస్తుంది. సింపుల్ డిజైన్ ఇష్టపడే వారికి ఈ కలర్ మంచి ఆప్షన్ గా ఉంటుంది. లూనార్ గ్రే కలర్ లైట్ గ్రే షేడ్‌ లో ఉంటుంది. దీనిపై డార్క్ గ్రే, ఎల్లో కలర్ గ్రాఫిక్స్ ఉండటం వల్ల స్కూటర్‌ కు మోడ్రన్ లుక్ వస్తుంది. ఈ మూడు కొత్త కలర్స్ సాధారణ సింగిల్ కలర్ మోడళ్లతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

ఇక సూపర్ పాస్ట్ గా ఛార్జింగ్!

Advertisement

కొత్త కలర్స్‌ తో పాటు కంపెనీ మరో ముఖ్యమైన అప్‌ డేట్ కూడా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అందిస్తున్న 700W ఛార్జర్ స్థానంలో ఇప్పుడు 900W ఛార్జర్‌ ను స్టాండర్డ్‌ గా అందిస్తోంది. ఈ కొత్త ఛార్జర్ వల్ల స్కూటర్ బ్యాటరీ ఛార్జింగ్ టైమ్ ఏకంగా  30 శాతం వరకు తగ్గుతుంది. ఇకపై తక్కువ సమయంలోనే స్కూటర్‌ ను పూర్తిగా ఛార్జ్ చేసుకుని ప్రయాణాన్ని  ప్రారంభించే అవకాశం ఉంటుంది. కొత్త కలర్స్, కొత్త ఛార్జర్ మినహా స్కూటర్‌ లో ఎలాంటి టెక్నికల్ మార్పులు లేవు. ఇదే 6.4kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ తో ఇది కొనసాగుతోంది. ఈ మోటార్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. సిటీ ప్రయాణాలకు సరిపడే వేగం, పనితీరును అందిస్తుంది.

రెండు బ్యాటరీ ఆప్షన్లు

ఏథర్ 450X రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మొదటి వెర్షన్‌లో 2.9kWh బ్యాటరీ ఉండగా, ఇది IDC  రిపోర్టు ప్రకారం పూర్తి ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అటు 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.

Advertisement

Read Also: నానో 2.0 రిలీజ్‌ కు కౌంట్‌డౌన్.. టీజర్‌ తోనే దుమ్మురేపిన టాటా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×