E-Paper
Advertisement

Ashok Leyland Cheetah: అశోక్ లేలాండ్ నుంచి సరికొత్త బస్సు, చీతాలా దూసుకుపోతుందంతే!

Ashok Leyland Cheetah: అశోక్ లేలాండ్ నుంచి సరికొత్త బస్సు, చీతాలా దూసుకుపోతుందంతే!
Advertisement

Ashok Leyland Cheetah Bus: ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ తయారీలో అశోక్ లేలాండ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బస్సులు, లారీలు సహా పలు వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ  చీతా అనే పేరుతో బస్సును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇంటర్‌ సిటీ, టూరిస్ట్ బస్ చాసిస్ మోడల్ గా రూపొందింది. స్పీడ్, ఎఫిషియెన్సీ,  కంఫర్ట్‌ కు కేరాఫ్ గా నిలుస్తోంది. అంతేకాదు, BS-VI ఎమిషన్ నార్మ్స్‌ తో వచ్చింది. తాజా వివరాల ప్రకారం ఈ బస్సు ధరలు, స్పెసిఫికేషన్లు సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అశోక్ లేలాండ్  చీతా ధరలు

అశోక్ లేలాండ్ చీతా బస్సు మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 36, 24, 47, 43, 46, 50 సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. వీల్‌ బేస్, డోర్ ఆప్షన్ల ప్రకారం వీటిని కంపెనీ విభజించింది. ఈ బస్సుకు సంబంధించి ప్రారంభ ధర రూ. 27.19 లక్షలు ఉంటుంది. టాప్ వేరియంట్ ధర రూ. 29.26 లక్షలుగా నిర్ణయించింది. ఆన్ రోడ్ ధరలు RTO, ఇన్సూరెన్స్ కలుపుకుని మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అశోక్ లేలాండ్  చీతా స్పెసిఫికేషన్లు

Advertisement

అశోక్ లేలాండ్  చీతా H సిరీస్, 6 సిలిండర్ CRS డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. డిస్‌ ప్లేస్‌ మెంట్ 5660 cc వరకు ఉంటుంది. 197 hp (147 kW) @ 2400 rpm పవరు ఉంటుంది. 700 Nm @ 1200-1900 rpm టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది.  ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ ఉంటుంది. 330 ఎంఎం డయాఫ్రమ్ టైప్, ఎయిర్ అసిస్టెడ్ హైడ్రాలిక్ ఆక్యువేషన్ క్లచ్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ 185 నుంచి 239 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బస్సు స్పీడ్ గరిష్టంగా 80 కిలో మీటర్లు. మైలేజ్ 3.5 నుంచి 4.5 కిలో మీటర్లు ఇస్తుంది. ఎమిషన్ నార్మ్స్ BS VIకు అనుగుణంగా ఉంటుంది.

అశోక్ లేలాండ్ చీతా సస్పెన్షన్, బ్రేక్స్

చీతా  ఫ్రంట్ సస్పెన్షన్ షాకిల్ ఎండెడ్ సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్, రియర్ సస్పెన్షన్ షాకిల్ ఎండెడ్ సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ ఉంటుంది.  ఫ్రంట్, రియర్ బ్రేక్స్ ఎయిర్ బ్రేక్స్ గా ఉంటాయి. పార్కింగ్ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. రియర్ ఆక్సల్ ఫుల్లీ ఫ్లోటింగ్ సింగిల్ రిడక్షన్ హైపాయిడ్గా ఉంటుంది.

అశోక్ లేలాండ్ చీతా  ఫీచర్లు

Advertisement

ఈ బస్సు ఫుల్లీ బిల్ట్ బాడీ ఆప్షన్ తో వస్తుంది. క్యాబిన్‌తో చాసిస్ ను కలిగి ఉంటుంది. సీటింగ్ లేఅవుట్  2×2 లేదంటే 3×2 ఉంటుంది. ఒక్కో వేరియంట్ లో ఒక్కోలా ఉంటుంది. సీట్ టైప్ పుష్ బ్యాక్ లేదంటే హై బ్యాక్ సీట్లు ఉంటాయి. బ్యాటరీ 24V  150Ahతో వస్తుంది. ప్యాసెంజర్ డోర్ సింగిల్ లేదంటే డబుల్ డోర్ తో వస్తుంది. సైడ్ విండోస్ ఉంటాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ABS ఉంటుంది. సీట్ బెల్ట్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, హ్యాట్‌ రాక్, లైట్స్, లగేజ్ బూట్ ఉంటుంది. ఈ మోడల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్‌కు సూటబుల్ అవుతుంది. చీతా బస్ ఫ్యూయల్ ఎకానమీ, స్పీడ్‌తో ఆపరేటర్లకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది.

Read Also: సరికొత్త కియా సెల్టోస్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×