E-Paper
Advertisement

ఏప్రిలియా టునో 457 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. ఫీచర్లు, కలర్స్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

ఏప్రిలియా టునో 457 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. ఫీచర్లు, కలర్స్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
Advertisement

2026 Aprilia Tuono 457 Special Edition: ఏప్రిలియా ఇండియా సరికొత్త టునో 457 స్పెషల్ ఎడిషన్ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.3.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. స్టాండర్డ్ టునో 457 ధర కంటే సుమారు రూ.2 వేలు ఎక్కువగా ఉంది. ప్రపంచ మోటార్‌ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక ఎడిషన్‌ ను కంపెనీ పరిచయం చేసింది.

దేశ వ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభం

ఈ కొత్త మోడల్‌కు  2006లో వచ్చిన ప్రముఖ టునో 1000R బైక్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను అందించారు. రోజువారీ ప్రయాణాలు, లాంగ్ రైడ్స్ చేసే వారికి మరింత సౌకర్యం కల్పించేలా ఇందులో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏప్రిలియా షోరూమ్‌లలో ఈ బైక్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. టునో 457 స్పెషల్ ఎడిషన్‌ను మాంబా బ్లాక్, ప్యూమా గ్రే రంగుల్లో అందిస్తున్నారు. బైక్ ముందు భాగంలో కొత్త స్మోక్డ్ ఫ్లైస్క్రీన్ ను యాడ్ చేశారు. ఇది ఎక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో గాలి ప్రభావాన్ని తగ్గించి రైడర్‌ కు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో లాంగ్ రైడ్స్ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. అలసట కూడా తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

రైడర్ సౌకర్యానికి పెద్దపీట

Advertisement

ఈ స్పెషల్ ఎడిషన్‌ లో రైడర్ సౌకర్యానికి పెద్దపీట వేశారు. హ్యాండిల్‌ బార్‌ ను కొద్దిగా ఎత్తుగా అమర్చడం వల్ల రైడర్ మరింత స్ట్రెయిట్ గా కూర్చునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చేతులు, భుజాలు, నడుముపై పడే ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో కొత్త రైడర్ సీటును కూడా అందించారు. ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫోమ్‌ను ఉపయోగించడం వల్ల ప్రయాణంలో వచ్చే వైబ్రేషన్లు తగ్గి, మరింత కంఫర్ట్ లభిస్తుంది. అలాగే సస్పెన్షన్ సెట్టింగ్స్‌ ను కూడా మెరుగుపరిచారు. గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా మంచి రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.

స్పెషల్ గా అడ్జస్టబుల్ బ్రేక్ లివర్

మరో ప్రత్యేక ఫీచర్‌గా అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ ను అందించారు. రైడర్ తన చేతి పరిమాణానికి అనుగుణంగా బ్రేక్ లివర్‌ ను సర్దుబాటు చేసుకోవచ్చు. దీని వల్ల బ్రేకింగ్ మరింత సులభంగా ఉండటంతో పాటు ఎక్కువ సేపు రైడ్ చేసినా చేతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌ లో స్టాండర్డ్ మోడల్‌ లో ఉన్న అదే 457 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఇది 47.6 హెచ్‌పీ పవర్, 43.5 ఎన్‌ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అటు బైక్‌ లో ఫుల్ కలర్ TFT డిస్‌ ప్లే, CAN ఆధారిత ఎలక్ట్రానిక్ సిస్టమ్, సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్లు, ల్యాప్ టైమర్ వంటి ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే పూర్తి LED లైటింగ్ సిస్టమ్, ఇమ్మొబిలైజర్‌ తో కూడిన ఇగ్నిషన్ సిస్టమ్‌ను కూడా అందించారు. యాక్సెసరీల పరంగా క్విక్ షిఫ్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ సిస్టమ్, USB ఛార్జింగ్ సాకెట్, ఫోర్క్ స్లైడర్లు, ప్యాసింజర్ సీట్ కవర్, వెహికల్ కవర్ లాంటి పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

4 సంవత్సరాల వారెంటీ

ఈ కొత్త టునో 457 స్పెషల్ ఎడిషన్‌కు ఏప్రిలియా 4 సంవత్సరాలు లేదా 48,000 కిలోమీటర్ల వారంటీను కూడా ప్రకటించింది. పనితీరును కొనసాగిస్తూ రైడర్ సౌకర్యం, రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Read Also: స్క్రాప్ నానోను లంబోర్ఘినిగా మార్చేశాడు.. యువకుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×