E-Paper
Advertisement

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!
Advertisement

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో TVS మోటార్ దుమ్మురేపుతోంది.  పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ లోనూ సత్తా చాటుతోంది. ఐక్యూబ్ లాంటి మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కంపెనీ తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరించేందుకు 2026-27లో పలు కొత్త మోడళ్లను తీసుకురానుంది. వీటిలో TVS బ్రాండ్ బైక్‌లు, స్కూటర్లతో పాటు నార్టన్ మోటార్‌ సైకిల్స్‌ కు చెందిన ప్రీమియం మోడళ్లు కూడా ఉన్నాయి.

1.TVS అపాచీ RR 450

TVS అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్‌ లలో అపాచీ RR 450 ఒకటి. ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌ గా రానుంది. BMW F 450 GSతో ప్లాట్‌ ఫారమ్, ఇంజిన్ లాంటి కీలక భాగాలను పంచుకునే అవకాశం ఉంది. ఇందులో 420cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇటీవల ఈ బైక్ టెస్టింగ్ సమయంలో భారత రోడ్లపై కనిపించడంతో మరింత క్యూరియాసిటీ పెంచింది. 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

2.TVS జూపిటర్ CNG

Advertisement

ప్రపంచంలోనే తొలి CNG స్కూటర్‌ గా TVS జూపిటర్ CNG ప్రత్యేక గుర్తింపు పొందింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో దీనిని ప్రదర్శించారు. 125cc ఇంజిన్‌ తో పాటు CNG, పెట్రోల్ రెండింటినీ ఉపయోగించే సౌకర్యం ఉంటుంది. కిలో CNGతో సుమారు 84 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. పూర్తి ట్యాంక్‌ తో మొత్తం 226 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో అందుబాటులోకి రానుంది.

3.నార్టన్ మ్యాంక్స్ R

TVS యాజమాన్యంలో ఉన్న నార్టన్ బ్రాండ్ నుంచి భారత మార్కెట్లోకి రానున్న తొలి సూపర్‌ బైక్ మ్యాంక్స్ R. ఇందులో 1200cc V4 ఇంజిన్ ఉంటుంది. 203 bhp పవర్, 130 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, రైడ్ మోడ్‌లు, 8 అంగుళాల TFT డిస్‌ ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇది CBU రూపంలో భారత్‌ కు వచ్చే అవకాశం ఉంది.

4.నార్టన్ అట్లాస్

Advertisement

అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ లను ఇష్టపడేవారి కోసం నార్టన్ అట్లాస్ రానుంది. దీనిని భారత్ లోనే తయారు చేయనున్నారు.  585cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ తో వచ్చే ఈ బైక్ సుమారు 70 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ లైట్స్, అడ్జస్టబుల్ లీవర్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. కవాసకి వెర్సిస్ 650కు గట్టి పోటీ ఇవ్వనుంది.

5.నార్టన్ అట్లాస్ GT

అట్లాస్‌ కు రోడ్ ఫోకస్డ్ వెర్షన్‌గా అట్లాస్ GT రానుంది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, టూరింగ్‌ కు అనువైన సెటప్ ఉంటుంది. 585cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ తో పాటు స్పోర్ట్, టూరింగ్, అర్బన్, ఆఫ్ రోడ్ లాంటి రైడ్ మోడ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, లీన్ సెన్సిటివ్ ABS, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.

Read Also: స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×