E-Paper
Advertisement

రూ.70 వేలలోపు సూపర్ EV స్కూటర్.. రియో VYB వచ్చేసింది!

రూ.70 వేలలోపు సూపర్ EV స్కూటర్.. రియో VYB వచ్చేసింది!
Advertisement

Ampere Rio VYB Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ బ్రాండ్ కింద కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘రియో VYB’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణాలు చేసే సిటీ వినియోగదారులను,  తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు.

రూ.69,499కే ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.69,499గా నిర్ణయించారు. అందుబాటు ధరలో EV కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మోడల్ బాగా నచ్చుతుంది. రియో VYB నాలుగు రంగులలో అందుబాటులోకి వచ్చింది. వార్మ్ వైట్, పాస్టెల్ పర్పుల్, డార్క్ గ్రే, ఆక్వా మెటాలిక్ కలర్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఈ స్కూటర్‌లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, షాపింగ్, తక్కువ దూరాల ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని భావిస్తున్నారు.

లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

Advertisement

రియో VYB తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీలోకి వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఈ కారణంగా ప్రస్తుత నిబంధనల ప్రకారం దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, నగరాల్లో తక్కువ దూరాలు ప్రయాణించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ లైప్ మీద కూడా కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ బ్యాటరీ సుమారు లక్ష కిలోమీటర్ల వరకు పనిచేసేలా రూపొందించామని ఆంపియర్ తెలిపింది. దీంతో వినియోగదారులు దీర్ఘకాలం పాటు బ్యాటరీ పనితీరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది.

ఫీచర్ల గురించి..

ఈ స్కూటర్‌ లో కలర్ LCD డిస్‌ ప్లే అందించారు. అలాగే, కీ ఫాబ్ సాయంతో కీలెస్ స్టార్ట్ సదుపాయం కూడా ఉంది. రాత్రి ప్రయాణాల్లో మెరుగైన విజిబిలిటీ కోసం LED హెడ్‌ ల్యాంప్, LED టెయిల్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు.  భద్రత కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌ ను అందించారు. సస్పెన్షన్ వ్యవస్థలో ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక డాంపర్ సెట్‌ అప్‌ ను ఉపయోగించారు. నగర రోడ్లపై సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం లభించే అవకాశం ఉంది.ఈ స్కూటర్‌ లో 24 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. హెల్మెట్, చిన్న బ్యాగులు, రోజువారీ అవసరాల వస్తువులను సులభంగా ఉంచుకునే వీలుంటుంది. హబ్ మోటార్ సిస్టమ్ ద్వారా ఈ స్కూటర్ ముందుకు కదులుతుంది.

Advertisement

అటు దేశవ్యాప్తంగా 400కు పైగా సర్వీస్ టచ్ పాయింట్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు తెలిపింది. అదనంగా, స్కూటర్‌పై 3 సంవత్సరాలు లేదంలే 30,000 కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తోంది. తక్కువ ధర, మంచి రేంజ్, లైసెన్స్ అవసరం లేకపోవడం లాంటి అంశాలతో ఆంపియర్ రియో VYB ప్రయాణికులకు చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు.

Read Also: వృద్ధుల కోసం క్రేజీ 4-వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. చూడ్డానికి భలే ఉంది భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×