E-Paper
Advertisement

Alto 800: మారుతి కార్లలో ఇప్పటికీ హాట్ ఫేవరెట్ ఆల్టో 800.. త్వరలో ఫేస్ లిఫ్ట్ వస్తుందా?

Alto 800: మారుతి కార్లలో ఇప్పటికీ హాట్ ఫేవరెట్ ఆల్టో 800.. త్వరలో ఫేస్ లిఫ్ట్ వస్తుందా?
Advertisement

Low Price, High Trust Alto 800: దశాబ్దాలుగా మారుతి ఆల్టో 800 భారతీయ మధ్య తరగతి కుటుంబాలకు హాట్ ఫేవరెట్ కారుగా కొనసాగుతోంది. 2023 ప్రారంభంలో ఈ కారు అధికారిక ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత కూడా.. దాని ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రీ ఓన్డ్ మార్కెట్‌ లో సత్తా చాటుతోంది. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ మారుతి కార్ల కోసం చూస్తున్నట్లు అయితే, ఆల్టో 800 బెస్ట్ ఆప్షన్ గా చెప్పపుకోవచ్చు. అత్యధికంగా రీసేల్ వ్యాల్యూ కలిగిన, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్‌ గా కొనసాగుతోంది.

తక్కువ ధరలో బెస్ట్ కారు

ఆల్టో మార్కెట్ లో సత్తా చాటేందుకు ముఖ్య కారణం యాక్సెసిబిలిటీ. సెకండ్ హ్యాండ్ ఆల్టో 800 ధర మంచి స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తుంది. ఇది కాలేజీ విద్యార్థుల నుంచి, చిన్న వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఏ ఇయర్ సెకెండ్ హ్యాండ్ కారు, ఎంత ధర ఉంటుదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ 2013-2015 మోడల్: ఈ ఇయర్ పెట్రోల్ వెర్షన్ కారు ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.2 లక్షలు పలుకుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవడం, షార్ట్ సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

⦿ 2016 – 2019 మోడల్: ఈ ఇయర్ పెట్రోల్ వెర్షన్ కారు ధర రూ. 2.3 లక్షల నుంచి రూ. 3.1 లక్షలు ఉంటుంది. మంచి రిలయబులిటీతో రోజు వారీ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿ 2020 – 2023 మోడల్: ఈ ఇయర్ మోడల్ కార్ల ధరలు రూ. 3.3 లక్షల నుంచి రూ. 4.5 లక్షలు ఉంటుంది. ఈ లేటెస్ట్ మోడల్ BS6 ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది.

ఆల్టో 800 సెకండ్ హ్యాండ్ కారును ఎందుకు ఇష్టపడుతున్నారు?   

⦿ మంచి మైలేజ్: ఇంధన ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఆల్టో 800 మంచి మైలేజ్ ఇవ్వడం కలిసి వస్తుంది. పెట్రోల్ వేరియంట్ సులభంగా 18–22 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ S-CNG మోడల్స్ ఏకంగా 31 కిమీ మైలేజ్ ఇస్తుంది. CNG ఆల్టో 800 ను లిక్విడ్ గోల్డ్‌ గా భావిస్తారు.

⦿ మంచి సర్వీసింగ్: ఆల్టో 800 సర్వీసింగ్ ఈజీగా చేయించుకోవచ్చు. విడిభాగాలు కూడా విరివిగా అందుబాటులో ఉంటాయి. వాటి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఏడాదికి ఈ కారు మెయింటెనెన్స్ కు రూ. 3,000 నుంచి రూ. 5,000 మధ్య ఖర్చవుతుంది.

Read Also: టాటా పంచ్ To మహీంద్రా XUV 3XO.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUV కార్లు ఇవే!

⦿ మంచి రీసేల్ వ్యాల్యూ: ఆల్టో 800ను ఇవాళ కొని, రేపు అమ్మినా, మంచి వ్యాల్యూను కలిగి ఉంటుంది. ఈ కారు డిమాండ్ ఎప్పుడూ సరఫరా కంటే ఎక్కువగా ఉంటుంది. మారుతి కార్లలో ఏ కారుకు ఇంత మంచి రీసేల్ వ్యాల్యూ ఉండదు.

ఒకవేళ మీరు కూడా తక్కువ ధరలో సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలనుకుంటే  ఆల్టో 800 నుంచి ఎంచుకోవడం బెస్ట్ అని చెప్పక తప్పదు!

Read Also: సెలెరియో To వ్యాగన్ R.. సూపర్ మైలేజ్ ఇచ్చే బెస్ట్ CNG కార్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×