E-Paper
Advertisement

Ajith Kumar: మహీంద్రా రేసింగ్ కారు కొన్న హీరో అజిత్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Ajith Kumar: మహీంద్రా రేసింగ్ కారు కొన్న హీరో అజిత్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

Ajith Kumar Mahindra BE 6 Formula E Car: తమిళ స్టార్ హీరో అజిత్ కు రేజింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తయన కార్ రేసింగ్స్ లో తరచుగా పాల్గొంటుంటారు. కొన్నిసార్లు ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆయన అదిరిపోయే మహీంద్రా BE 6 ఫార్ములా E కారును కొనుగోలు చేశాడు. షోరూమ్‌ లో తాజాగా ఈ కారు ముందు ఫోటోలకు పోజులు ఇచ్చారు.

అజిత్ కుమార్ కొత్త మహీంద్రా BE 6 ఫార్ములా E కారు

మహీంద్రా ఎలక్ట్రిక్ SUVల అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అజిత్ BE 6 ఫార్ములా E కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కారు FE2 వెర్షన్ ధర రూ. 23.69 లక్షలు కాగా, యాడ్ ఆన్ ఫీచర్లతో FE3 వెర్షన్ ధర రూ. 24.49 లక్షలు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 202 కి.మీ. అజిత్ కలర్ కోసం టాంగో రెడ్ వేరియంట్‌ ను ఎంచుకున్నాడు.

Advertisement

అజిత్ ను వ్యక్తిగతంగా అభినందిస్తా!

అటు అజిత్ కుమార్ సరికొత్త BE 6 ఫార్ములా E కారును కొనుగోలు చేయడం పట్ల ఆనంద్ మహీంద్రా స్పందించారు. సూపర్ స్టార్ అజిత్ కుమార్ & మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని కామెంట్ చేశారు. త్వరలో ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు చెప్పడంతో పాటు తమ కారును కొనుగోలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు.

Advertisement

సాయిబాబా ఆలయాన్ని సందర్శంచిన అజిత్

ఈ కారు కొనుగోలుకు ముందు అజిత్ షిరిడి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు.  శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అజిత్ ఆలయాన్ని సందర్శించిన వీడియో పోస్ట్ చేసింది. అజిత్ తన బృందంతో వచ్చిన తర్వాత ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు వీడియోలో ఉంది. అజిత్ ఆలయం లోపల ప్రార్థనలు చేస్తూ సాయిబాబా ఆశీర్వాదం కోరుతున్నట్లు  వీడియోలో కనిపించింది. దర్శనం తర్వాత, ఆయన ఆలయ అధికారులతో ఫోటోలు దిగారు. వారు ఆయనకు సాయిబాబా విగ్రహం, శాలువాను బహుకరించారు. దర్శనం తర్వాత వారితో కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

అజిత్ కుమార్ రేసింగ్ కెరీర్

అజిత్ ఒక ప్రొఫెషనల్ రేసర్, నటుడు. అతడు 2003 ఫార్ములా ఆసియా BMW ఛాంపియన్‌షిప్‌, 2010 ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌ లో పోటీ పడ్డాడు. 2002లో జరిగిన ఫార్ములా మారుతి ఇండియన్ ఛాంపియన్‌షిప్‌ రేసులో కూడా పాల్గొన్నాడు.  పోర్స్చే 992 GT3 కప్ విభాగంలో 24H సిరీస్‌ లో పాల్గొన్నాడు. అతడు 2026 లే మాన్స్ కప్‌ లోనూ పార్టిసిపేట్ చేశాడు. రేసింగ్ నుంచి విరామం దొరికినప్పుడు మాత్రమే ఆయన సినిమాల్లో నటిస్తున్నాడు.  అజిత్ చివరిసారిగా గత సంవత్సరం ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఓ రేజింగ్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: హోండా షాకింగ్ డెసిషన్, ఆ రెండు కీలక మోడల్స్ కు బ్రేక్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×