E-Paper
Advertisement

ఆటోమేటిక్ కారు కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ఆటోమేటిక్ కారు కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Advertisement

Automatic Car Buying Guide: ఈ రోజుల్లో చాలా మంది డ్రైవింగ్‌ను సులభంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకే, మార్కెట్ లో ఆటోమేటిక్ కార్లపై ఆసక్తి పెరుగుతోంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సిటీల్లో అయితే, ఈ కార్లు మరింత ఉపయోగకరంగా మారాయి. అయితే, ఆటోమేటిక్ కారు కొనడానికి ముందు, దాని లాభాలు, నష్టాలు రెండింటినీ తెలుసుకోవడం మంచిది.

ఆటోమేటిక్ కార్లతో లాభాలు

ఆటోమేటిక్ కార్లలో  బెస్ట్ బెనిఫిట్ సౌకర్యం. మాన్యువల్ కార్లలా గేర్ మార్చాల్సిన అవసరం ఉండదు. క్లచ్ ఉపయోగించాల్సిన పని ఉండదు. ట్రాఫిక్‌ లో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లే వారికి పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా నగరాల్లో సిగ్నల్స్ దగ్గర, స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌ లో ఆటోమేటిక్ కారు డ్రైవింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

Advertisement

ఇక కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఆటోమేటిక్ కారు మరింత సులభం. గేర్, క్లచ్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా, స్టీరింగ్, బ్రేక్‌ పై ఫోకస్ చేయవచ్చు. దీంతో డ్రైవింగ్ నేర్చుకోవడం త్వరగా పూర్తవుతుంది.

ఆటో మేటిక్ కార్లతో ప్రతికూలతలు

ఆటోమేటిక్ కార్లతో లాభాలే కాదు, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మోడల్‌ లో మాన్యువల్ వేరియంట్‌తో పోలిస్తే ఆటోమేటిక్ కారు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.

Advertisement

ప్యూయెల్ వినియోగం విషయంలో కూడా కొంత తేడా ఉంటుంది. పాత తరహా ఆటోమేటిక్ కార్లు మాన్యువల్ కార్లతో పోలిస్తే ఎక్కువ ప్యూయెల్ తీసుకుంటాయి.ఇప్పుడు కొత్త టెక్నాలజీలతో వచ్చిన కార్లు ఈ సమస్యను చాలా వరకు తగ్గించాయి. అయినప్పటికీ, కొంతమేర తేడా ఉండే అవకాశం ఉంటుంది.

Read Also: గ్రాండ్ విటారా To బాలెనో.. మారుతి కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

ఇక డ్రైవింగ్ కంట్రోల్ విషయంలో కూడా కొందరికి ఆటోమేటిక్ కారు తక్కువ కంట్రోల్ ఉన్నట్లు అనిపిస్తుంది.  మాన్యువల్ కార్లలో గేర్ మార్చడం ద్వారా స్పీడ్, పవర్‌ ను కంట్రోల్ చేయవచ్చు. కానీ, ఆటోమేటిక్‌ లో ఈ ఫీల్ కొద్దిగా తగ్గుతుంది. ముఖ్యంగా హిల్స్, ఆఫ్ రోడ్ డ్రైవింగ్‌ లో మాన్యువల్ కార్లు కొంచెం మెరుగ్గా అనిపిస్తాయి.

ఒకవేళ రోజూ ట్రాఫిక్‌లో ఎక్కువగా డ్రైవ్ చేస్తే, సౌకర్యం కోరుకుంటే ఆటోమేటిక్ కారు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. కానీ ఖర్చు తగ్గించాలని, పూర్తి డ్రైవింగ్ కంట్రోల్ కావాలని భావిస్తే మాన్యువల్ కారు తీసుకోవడం మంచిది. మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం బెస్ట్.

Read Also: టాటా EVలపై క్రేజీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.3 లక్షల డిస్కౌంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×