E-Paper
Advertisement

సమ్మర్ డ్రైవ్ లో ఫ్యూయెల్ సేవింగ్ ఎలా? ఏసీ వేయాలా? కిటికీలు తెరవాలా?

సమ్మర్ డ్రైవ్ లో ఫ్యూయెల్ సేవింగ్ ఎలా? ఏసీ వేయాలా? కిటికీలు తెరవాలా?
Advertisement

Save Fuel While Staying Cool: వేసవిలో డ్రైవింగ్ చేసే వారికి కామన్ గా వచ్చే ఓ డౌట్ ఉంది. ఏసీ ఆన్ చేయాలా? లేక విండోస్ ఓపెన్ చేసి ప్రయాణించాలా? అనుకుంటారు. చాలామంది కిటికీలు తెరవడం వల్లే ఫ్యూయెల్ ఆదా అవుతుందని అనుకుంటారు. కానీ, నిజానికి ఇది అంత ఈజీ విషయం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో డ్రైవ్ చేస్తున్నారో, ముఖ్యంగా వేగం ఎంత ఉందో? అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

సిటీ ప్రయాణంలో ఎలా వెళ్లాలి?  

సిటీలో తక్కువ వేగంతో.. అంటే గంటకు 40-45 కిలోమీటర్ల లోపే డ్రైవ్ చేస్తున్నప్పుడు, విండోస్ ఓపెన్ చేసి ప్రయాణించడం మంచిది. ఈ సమయంలో ఎయిర్ డ్రాగ్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కిటికీలు తెరిచి ఉన్నా కారుపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే, అదే సమయంలో ఏసీ ఆన్ చేస్తే, అది ఇంజిన్‌పై అదనపు భారం పెడుతుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది.

హైవే ప్రయాణంలో ఏం చేయాలి?

Advertisement

సిటీలో కాకుండా హైవేలో, ముఖ్యంగా 50-60 కిలోమీటర్లకు పైగా వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ సమయంలో కిటికీలు తెరిచి ఉంటే గాలి కారులోకి వస్తుంది. దీని వల్ల కారు ముందుకు వెళ్లడానికి గాలి అడ్డంకిగా మారుతుంది. దీనిని పారాచూట్ ఎఫెక్ట్ లాగా భావించవచ్చు. దీంతో ఇంజిన్ మరింత శక్తి వినియోగించి కారు నడపాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో కిటికీలు మూసి ఏసీ వాడటం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

ఏసీ అనేది ఇంజిన్ నుంచి పవర్ తీసుకుని పనిచేస్తుంది. ఏసీ ఆన్ చేస్తే సుమారు 3 నుంచి 7 హార్స్‌ పవర్ వరకు శక్తి వినియోగిస్తుంది. దీని వల్ల ఇంధన వినియోగం 10% నుంచి 25% వరకు పెరగవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్‌ లో నెమ్మదిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

Advertisement

మరోవైపు, కిటికీలు తెరవడం వల్ల ఇంజిన్‌పై నేరుగా భారం పడదు. కానీ గాలి ప్రవాహం మారిపోవడం వల్ల కార్ ఏరోడైనమిక్స్ దెబ్బతింటుంది. లేటెస్ట్ కార్లు గాలి నిరోధాన్ని తగ్గించేలా డిజైన్ చేయబడ్డాయి. కిటికీలు తెరిచి వేగంగా వెళ్తే, ఈ డిజైన్ ప్రభావం తగ్గిపోతుంది. చిన్న కార్లలో ఇది 20% వరకు డ్రాగ్ పెరగడానికి కారణం అవుతుంది.

ఫ్యూయెల్ సేవ్ కావాలంటే?

సాధారణంగా సిటీ ట్రాఫిక్‌ లో కిటికీలు తెరవడం మంచిది. హైవేలో అయితే ఏసీ వాడటం మంచిది. అయితే, రియల్ వరల్డ్ లో చూస్తే ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా ఉండదు. సాధారణంగా లీటరుకు 1-2 కిలోమీటర్ల వరకు మాత్రమే మార్పు ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఖర్చులో తేడా చూపిస్తుంది. ఇంధనం ఆదా చేసుకుంటూ చల్లగా ఉండాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేయకుండా, ముందు ఒక నిమిషం కిటికీలు తెరిచి వేడి గాలి బయటకు పంపాలి. తర్వాత ఏసీ ఆన్ చేసి రీసర్క్యులేషన్ మోడ్ ఉపయోగిస్తే చల్లదనం త్వరగా వస్తుంది. ఎప్పుడూ ఫుల్ కూలింగ్ వాడకుండా మోస్తరు స్థాయిలో ఉంచడం మంచిది. అలాగే కారును నీడలో పార్క్ చేయడం లేదంటే సన్‌ షేడ్ ఉపయోగించడం వల్ల లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది.

Read Also: తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. పెట్రోల్, డీజిల్, CNGలో ఏది బెస్ట్ ఫ్యూయెల్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×