E-Paper
Advertisement

Useless Features in Cars: కార్లలో పనికిరాని ఫీచర్లు.. వీటికోసం డబ్బులు వేస్ట్ చేయకండి!

Useless Features in Cars:  కార్లలో పనికిరాని ఫీచర్లు.. వీటికోసం డబ్బులు వేస్ట్ చేయకండి!
Advertisement

Useless Cars Features:  లేటెస్ట్ కార్లు అదిరిపోయే క్రేజీ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇండియన్ వెదర్ కు, రోడ్లు,   డ్రైవింగ్ అలవాట్లకు పూర్తిగా పనికి రావు. కార్ల ధరలు పెరిగేందుకు ఈ ఫీచర్లు కారణం అయినప్పటికీ, వీటితో  ఉపయోగం మాత్రం తక్కువ. ఇంతకీ, ఇండియన్ కార్లలో పనికిరాని 5 టాప్ ఫీచర్ల గురించి ఇప్పుడు చర్చిద్దాం..

⦿ పనోరమిక్ సన్‌ రూఫ్ (Panoramic Sunroof)

ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. కానీ, దేశంలో వేడి, దుమ్ము, ధూళి, వర్షాల వల్ల చాలామంది ఎప్పుడూ స్లైడ్ ను  మూసి ఉంచుతారు. కారు బరువు పెరిగి, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ తగ్గుతుంది. AC ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. చిన్న పిల్లలు తల బయట పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. చాలా మంది కారు ఓనర్లు ఎప్పుడూ వీటిని ఉపయోగించమని చెప్తారు.

⦿ ప్యాడిల్ షిఫ్టర్స్ (Paddle Shifters in non-performance cars)

Advertisement

స్పోర్ట్స్ కార్లలో చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. కానీ, సాధారణ ఆటోమేటిక్ కార్లలో (100-150 hp) ఎవరూ ఉపయోగించరు. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ మెరుగ్గా షిఫ్ట్ చేస్తుంది. ఇది కేవలం మార్కెటింగ్ జిమ్మిక్ గా చెప్పుకోవచ్చు. ధర పెరిగినా, ఉపయోగం జీరో.

⦿ జీ-ఫోర్స్ మీటర్ (G-Force Meter)

రేసింగ్ కార్లలో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, సాధారణ కార్లలో ఇది కేవలం స్క్రీన్‌ పై అనిమేషన్. రోజువారీ డ్రైవింగ్‌లో 0.3g, 0.5g తేడా ఎవరికి పట్టదు. స్పీడోమీటర్, ఫ్యూయల్ ఎకానమీ చూడటానికి బదులు స్క్రీన్ స్పేస్ వేస్ట్.

⦿ వాయిస్ కమాండ్స్ (Voice Commands)

Advertisement

AC ఆన్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం వంటివి చెప్పాలి, కానీ, ఇండియన్ యాసలో సరిగ్గా గుర్తించదు. చివరికి బటన్లు నొక్కడమే సులువు. డ్రైవింగ్ సమయంలో డిస్ట్రాక్షన్ పెంచుతుంది. చాలా మంది వాయిస్ కమాండ్స్ ఎప్పుడూ ఉపయోగించరు.

⦿ వైర్‌ లెస్ ఛార్జర్ (Wireless Phone Charger)

రోడ్లపై బంప్స్ వల్ల ఫోన్ జరిగి ఛార్జింగ్ ఆగిపోతుంది. కేబుల్ ఛార్జర్ మెరుగ్గా పని చేస్తుంది. చాలా కార్లలో ఇది నెమ్మదిగా ఛార్జ్ చేస్తుంది. కొన్నిసార్లు హీట్ అవుతుంది. ఇది అనుకున్న స్థాయిలో ఛార్జింగ్ ను చేయదు.

Read Also: లాంచింగ్ కు రెడీ అయిన సూపర్ ఓలా బైక్స్.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

ఈ ఫీచర్లు చాలా వరకు ఉపయోగకరం కాదు. వ్యక్తిగత ప్రాధాన్యతలు, డ్రైవింగ్ అలవాట్లు,  వినియోగ పరిస్థితులను బట్టి ఫీచర్ ఉపయోగం మారవచ్చు. కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు బయ్యర్లు వారి స్వంత అవసరాలను అంచనా వేసుకోవాలి. లక్షణాలను వ్యక్తి గతంగా పరీక్షించాలి. ఇంకా చెప్పాలంటే, ఈ ఫీచర్లు మార్కెటింగ్‌ కి బాగుంటాయి. కానీ, రోజువారీ ఉపయోగంలో పనికిరావు. కారు కొనేటప్పుడు సేఫ్టీ, మైలేజ్, కంఫర్ట్ చూసి ఎంచుకోవాలి. ఈ జిమ్మిక్స్ కి  ఎక్స్‌ ట్రా పే చేయాల్సిన అవసరం లేదు.

Read Also:  కియా To మహీంద్రా.. కొత్త ఏడాది సరికొత్తగా అడుగు పెట్టబోతున్న హైబ్రిడ్ కార్ల!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×