E-Paper
Advertisement

మారుతి డిజైర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

మారుతి డిజైర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Advertisement

Maruti Suzuki Dzire 2026: మారుతి సుజుకి డిజైర్ సబ్‌ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో చాలా కాలంగా మంచి ప్రజాదరణ పొందిన కారు. తక్కువ ధర, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ తో మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఆప్షన్ గా మారింది. తాజా మోడల్‌ లో కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ కారు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

⦿ ధర, వేరియంట్లు

కొత్త డిజైర్ సుమారుగా రూ.6.25 లక్షల నుంచి రూ.9.31 లక్షల వరకు అందుబాటులో ఉంది. LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో వస్తుంది. బేస్ వేరియంట్ సాధారణ అవసరాలకు సరిపోతుంది. మధ్య వేరియంట్లలో AMT, CNG ఎంపికలు కూడా లభిస్తాయి. టాప్ వేరియంట్ ఎక్కువ ఫీచర్లతో ప్రీమియం అనుభవాన్ని ఇస్తుంది.

⦿ డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, న్యూ జెనరేషన్ మోడల్‌ లో బయట నుంచి చూసినప్పుడు మరింత సూపర్ లుక్ కనిపిస్తుంది. ముందుభాగం, లైట్లు, గ్రిల్ డిజైన్‌ లో మార్పులు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. లోపల క్యాబిన్ కూడా అద్భుతంగా ఉంటుంది. డాష్‌ బోర్డ్ కొత్తగా డిజైన్ చేసి, కారు మొత్తం ఫీలింగ్‌ ను మరింత ప్రీమియంగా మార్చారు.

⦿ ఇంజిన్ పనితీరు

ఇంజిన్ పనితీరు ఈ మోడల్‌లో మారింది. ఇందులో 1.2 లీటర్ కొత్త పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 80 bhp శక్తి, 112 Nm టార్క్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. CNG వేరియంట్ కూడా ఉంది. కానీ.. అది మాన్యువల్‌ తో మాత్రమే వస్తుంది. రోజువారీ డ్రైవింగ్‌కు సరిపడే పనితీరు ఇది అందిస్తుంది.

⦿ మైలేజ్

Advertisement

మైలేజ్ విషయానికి వస్తే, డిజైర్ ఎప్పటిలాగే మంచి ప్రయాణ పరిధిని అందిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ సుమారు 24–25 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. AMT వేరియంట్ కొంచెం ఎక్కువగా ఇస్తుంది. CNG వేరియంట్ అయితే ఇంకా ఎక్కువగా, దాదాపు 33 కిలో మీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఇంధన ఖర్చు తగ్గించాలని చూస్తున్న వారికి ఇది మంచి ప్లస్ పాయింట్.

⦿ ఫీచర్లు, భద్రత

ఫీచర్ల పరంగా కూడా ఈ కారు మరింత అప్‌డేట్ అయింది. టాప్ వేరియంట్లలో పెద్ద టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక AC వెంట్స్, వైర్‌ లెస్ ఛార్జింగ్, USB పోర్ట్స్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. బేస్ వేరియంట్లలో మాత్రం అవసరమైన ఫీచర్లే ఉంటాయి.  భద్రత విషయానికి వస్తే, కొత్త డిజైర్‌కు మంచి క్రాష్ టెస్ట్ రేటింగ్ లభించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC, హిల్ హోల్డ్ లాంటి  ఫీచర్లు స్టాండర్డ్‌ గా ఉంటాయి. అవసరాలు, బడ్జెట్‌ ను బట్టి సరైన వేరియంట్ ఎంచుకోవడం మంచిది.

Read Also: ఇండియాలోని ఈ ఫేమస్ కార్లు ఏయే దేశాలకు చెందినవో తెలుసా? దేనికదే ప్రత్యేకం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×