E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ ఆటోలో గూగుల్ జెమిని.. డ్రైవింగ్‌ ను ఈజీ చేసే ఈ 5 స్మార్ట్ ఫీచర్ల గురించి మీకు తెలుసా?

ఆండ్రాయిడ్ ఆటోలో గూగుల్ జెమిని.. డ్రైవింగ్‌ ను ఈజీ చేసే ఈ 5 స్మార్ట్ ఫీచర్ల గురించి మీకు తెలుసా?
Advertisement

ఈ రోజుల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మ్యాప్స్, కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్ ఇలా అన్నింటినీ ఒకేసారి చూసుకోవాల్సి వస్తోంది. దీంతో చాలామంది డ్రైవర్లు ఫోన్, కార్ స్క్రీన్‌ మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫలితంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు గూగుల్ తన జెమిని ఏఐని ఆండ్రాయిడ్ ఆటోలో అందుబాటులోకి తీసుకొచ్చింది. జెమిని సాయంతో డ్రైవర్లు ఫోన్‌ ను చేతిలోకి తీసుకోకుండా పలు పనులు వాయిస్ కమాండ్లతో చేయవచ్చు. డ్రైవింగ్‌ను మరింత సేఫ్ గా, సౌకర్యవంతంగా మార్చే 5 క్రేజీ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.గ్రూప్ చాట్స్  

కొన్నిసార్లు వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లలో ఒకేసారి చాలా మెసేజ్‌లు వస్తుంటాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చదవడం సాధ్యం కాదు. జెమిని ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది. పెద్ద మెసేజ్ లను చదివి, అందులోని ముఖ్యమైన విషయాలను వివరిస్తుంది. మీ స్నేహితులు ఆలస్యంగా వస్తున్నారని, మీటింగ్ టైమ్ మారిందని సింపుల్ గా వివరిస్తుంది. డ్రైవర్‌ కు అవసరమైన సమాచారం అందిస్తుంది.

2.స్మార్ట్ రిప్లైస్

Advertisement

డ్రైవింగ్ సమయంలో వచ్చిన మెసేజ్‌ లకు వెంటనే స్పందించడం కష్టం. కానీ, గూగుల్ జెమిని దీనికి పరిష్కారం చూపిస్తుంది. అవసరమైన సమాధానాలను అందిస్తుంది. “ఎప్పుడు వస్తావు?” అని అడిగితే, “కొద్ది సేపట్లో చేరుకుంటాను”,  “ట్రాఫిక్‌లో ఉన్నాను” లాంటి సమాధానాలను సూచిస్తుంది. డ్రైవర్ ఒక ట్యాప్‌ తో, వాయిస్ ద్వారా ఆ సమాధానాన్ని పంపించవచ్చు.

3.ఆటోమేటిక్ గా పనులు చేస్తుంది!   

చాలామంది ప్రయాణం మొదలుపెట్టే ముందు మ్యాప్స్ ఓపెన్ చేయడం, మ్యూజిక్ ఆన్ చేయడం, ఏసీ సెట్ చేయడం లాంటి పనులు చేస్తుంటారు. జెమిని ఈ పనులను ఆటోమేటిక్‌ గా చేస్తుంది. ఒక వాయిస్ కమాండ్ ఇస్తే, అది నావిగేషన్ ప్రారంభించడం, ఇష్టమైన పాటలు ప్లే చేయడం, ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించడం లాంటి పనులను ఒకేసారి చేస్తుంది. దీంతో సమయం ఆదా అవుతుంది.

4.ఒకేసారి చాలా డీటైల్స్ వెతకడం

Advertisement

పాత వాయిస్ అసిస్టెంట్లు ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పగలిగేవి. కానీ, జెమిని ఒకేసారి అనేక విషయాలను అర్థం చేసుకుని సమాచారాన్ని అందిస్తుంది. “నా దగ్గరలో మంచి రేటింగ్ ఉన్న కాఫీ షాప్ దగ్గర ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ ఉందా?” అని అడిగితే, రెండింటి సమాచారాన్ని కలిపి ఫలితాలను చూపిస్తుంది. డ్రైవర్‌కు మధ్యలో ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

5.ఈమెయిల్స్, క్యాలెండర్ డీటైల్స్ వాయిస్ ద్వారా అందించడం

మనకు అవసరమైన చాలా వివరాలు ఈమెయిల్, క్యాలెండర్‌ లో ఉంటాయి. కానీ, డ్రైవింగ్ సమయంలో వాటిని తెరిచి చూడడం సురక్షితం కాదు. జెమిని మీ ఈమెయిల్స్ నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుని చెబుతుంది.   విమానం బయలుదేరే సమయం, హోటల్ అడ్రస్, డెలివరీ వివరాలు లాంటి సమాచారాన్ని వాయిస్ రూపంలో అందిస్తుంది.

Read Also: సేఫ్టీ To ఎంటర్‌టైన్‌మెంట్.. కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 8 స్మార్ట్ గాడ్జెట్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×