E-Paper
Advertisement

ఎండలో పార్క్ చేసినా కారు చల్లగా ఉండాలా? ఈ సింపుల్ ట్రిప్స్ ట్రై చేయండి!

ఎండలో పార్క్ చేసినా కారు చల్లగా ఉండాలా? ఈ సింపుల్ ట్రిప్స్ ట్రై చేయండి!
Advertisement

Top 5 Car Cooling Tricks: ఎండాకాలంలో కారును బయట పార్క్ చేయాల్సి వస్తే, కొద్దిసేపటికే లోపల కూర్చోవడం కష్టంగా మారుతుంది. మధ్యాహ్నం వేళల్లో ఎండ నేరుగా కారుపై పడితే, స్టీరింగ్ వీల్ నుంచి సీట్లు వరకు అన్నీ వేడెక్కుతాయి.  నీడలో పార్కింగ్ చేసే పరిస్థితి లేనప్పుడు, కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే కారును కొంత వరకు చల్లగా ఉంచుకోవచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా ఉపయోగపడే 5 ఈజీ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఫ్రంట్ విండ్‌షీల్డ్ సన్‌షేడ్

ఎండాకాలంలో మంచి క్వాలిటీ ఉన్న ఫ్రంట్ విండ్‌ షీల్డ్ సన్‌ షేడ్ వాడటం మంచిది. కారు ముందు గ్లాస్ భాగం పెద్దదిగా ఉండటంతో ఎక్కువ వేడి లోపలికి వస్తుంది. అందుకే సిల్వర్ కోటింగ్ రిఫ్లెక్టివ్ సన్‌ షేడ్‌ ను వాడితే సన్ లైట్ నేరుగా డాష్‌ బోర్డ్, సీట్లపై పడకుండా అడ్డుకుంటుంది. దీనిని అమర్చడానికి కొంచెం టైమ్ పడుతుంది. కానీ, లోపలికి వేడి రాకుండా  తగ్గుతుంది. కారులోకి తిరిగి ఎక్కినప్పుడు ఏసీ త్వరగా చల్లబడటానికి సాయపడుతుంది.

⦿ కిటికీలను కొద్దిగా ఓపెన్ చేయాలి!

Advertisement

ఇక కారు కిటికీలను పూర్తిగా మూసేయకుండా కొద్దిగా తెరిచి ఉంచడం మంచిది. పూర్తిగా మూసివేసిన కారులో వేడి గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో లోపల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. కిటికీలను కాస్త చిన్న గ్యాప్ వచ్చేలా ఉంచితే గాలి బయటకు వెళ్లి లోపల గాలి ప్రసరణ జరుగుతుంది. కారులో వేడి కొంతవరకు తగ్గుతుంది. అయితే, భద్రత దృష్ట్యా ఎక్కువగా ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలి. వర్షం నీరు లోపలికి రాకుండా కూడా చూసుకోవాలి.

⦿ స్టీరింగ్ వీల్ పై క్లాత్ కప్పడం

స్టీరింగ్ వీల్, గేర్ లివర్‌ మీద క్లాత్ వేయడం మంచిది. ఎండలో నిలిపిన కారులో స్టీరింగ్‌ వేడెక్కుతుంది. ముట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కారులో లైట్ కలర్ టవల్ లేదంటే కాటన్ క్లాత్ ఉంచుకోవాలి.  కారును పార్క్ చేసే సమయంలో స్టీరింగ్, గేర్‌ బాక్స్‌ పై క్లాత్ కప్పేస్తే ఎక్కువగా వేడెక్కవు. ముఖ్యంగా తెలుపు, లైట్ కలర్ క్లాత్ వేడిని తక్కువగా గ్రహిస్తాయి. వేడి తక్కువగా ఉంటుంది.

⦿ డోర్ ఫ్యాన్ ట్రిక్

Advertisement

డోర్ ఫ్యాన్ ట్రిక్.. చాలా మందికి తెలిసిన సింపుల్ టెక్నిక్. ముందుగా ఓ విండోను డౌన్ చేయాలి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న విండోను  కొన్ని సార్లు వేగంగా తెరిచి మూసేయాలి. ఇలా చేయడం వల్ల కారులో ఉన్న వేడి గాలి బయటకు వెళ్లి బయట గాలి లోపలికి వస్తుంది. కేవలం కొన్ని సెకన్లలోనే క్యాబిన్ కొద్దిగా చల్లబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత ఏసీ ఆన్ చేయాలి.

⦿ సోలార్ పవర్ వెంటిలేషన్ ఫ్యాన్లు

మార్కెట్లో సోలార్ పవర్ వెంటిలేషన్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కారు విండోకి అమర్చుతారు. ఇవి సూర్యరశ్మి ద్వారా పని చేస్తూ లోపల ఉన్న వేడి గాలిని బయటకు పంపిస్తాయి. కారు ఆపి ఉన్న సమయంలో కూడా గాలి ప్రసరణ కొనసాగుతుండటంతో లోపల వేడి తగ్గుతుంది. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎండలో కూడా కారులో ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.

Read Also: 45°C వేడిలో ఈవీ కార్లు నడుపుతున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×