E-Paper
Advertisement

వచ్చే 12 నెలల్లో 5 కొత్త కార్లు లాంచ్.. మారుతి ప్లాన్ మామూలుగా లేదుగా!

వచ్చే 12 నెలల్లో 5 కొత్త కార్లు లాంచ్.. మారుతి ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

మారుతి సుజుకి రాబోయే ఏడాది కాలంలో భారత మార్కెట్లోకి అదిరిపోయే కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం కంపెనీ ఐదు కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తోంది. వీటిలో రెండు ఎస్‌యూవీలు, రెండు హ్యాచ్‌ బ్యాక్‌ లు, ఒక ఎలక్ట్రిక్ ఎంపీవీ ఉన్నాయి. ఇప్పటికే ఈ వాహనాలు భారత రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్

త్వరలో మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మోడల్ పెట్రోల్‌ తో పాటు  ఇథనాల్ తోనూ నడవనుంది. దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఇదో కీలక అడుగుగా భావిస్తున్నారు.

⦿ కొత్త మారుతి ఫ్రాంక్స్

Advertisement

ఈ కారు త్వరలో అప్‌ డేట్ రూపంలో రానుంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు సాధిస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి కొత్త డిజైన్ టచ్‌ లు, మెరుగైన ఇంటీరియర్ ఫీచర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంజిన్‌లో పెద్ద మార్పులు ఉండకపోయినా, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో పాటు అధునాతన ADAS భద్రతా ఫీచర్లు జోడించే అవకాశం ఉందని సమాచారం.

⦿ బాలెనో ఫేస్‌లిఫ్ట్

ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ బాలెనో కూడా ఫేస్‌ లిఫ్ట్ రూపంలో రానుంది. 2022లో న్యూ జెనరేషన్ మోడల్ వచ్చిన తర్వాత పెద్ద మార్పులు జరగలేదు. ఇప్పుడు కొత్త బంపర్లు, లైటింగ్ ఎలిమెంట్లు, అప్‌డేట్ చేసిన క్యాబిన్ ఫీచర్లతో బాలెనోను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. అయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యథాతథంగా కొనసాగనుంది.

⦿ YMC ఎలక్ట్రిక్ ఎంపీవీ

Advertisement

మారుతి నుంచి రానున్న మరో ఆసక్తికర మోడల్ ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఎంపీవీ. ప్రస్తుతం దీనిని YMC కోడ్ నేమ్‌ తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఈ విటారాతో కొన్ని టెక్నికల్ అంశాలను పంచుకునే అవకాశం ఉంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చని అంచనా. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ ఎంపీవీ, ధర పరంగా కూడా పోటీదారుల కంటే అందుబాటులో ఉండే అవకాశముంది.

⦿ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

ఇక బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా త్వరలోనే రానుంది. ఈ మోడల్ ఇప్పటికే టెస్టింగ్ సమయంలో కనిపించింది. బయట భాగంలో చిన్నపాటి డిజైన్ మార్పులు మాత్రమే కనిపించే అవకాశం ఉన్నా, లోపల మాత్రం పెద్ద అప్‌ డేట్స్ ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 9 అంగుళాల టచ్‌ స్క్రీన్ స్థానంలో 10.1 అంగుళాల పెద్ద స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కొత్త ఫీచర్లు జోడించనున్నారు. CNG వెర్షన్‌ లో బూట్ స్పేస్ పెంచేందుకు ట్యాంక్‌ ను వాహనం కింద అమర్చే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా, కొత్త 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ ను కూడా అందించే అవకాశముందని తెలుస్తోంది.

Read Also: కొత్త టియాగో EVలో క్రేజీ కలర్స్, ఏ వేరియంట్‌ లో ఏ కలర్ అందుబాటులో ఉందంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×