E-Paper
Advertisement

కారు అమ్ముతున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

కారు అమ్ముతున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!
Advertisement

Car Selling Guide: కార్లు కొనడం, అమ్మడం కామన్. అయితే, కారును అమ్మడం అనేది ఎక్కువ ధర వచ్చింది కదా అని అనుకోవడం మాత్రమే కాదు. సరైన విధంగా ఈ అమ్మకం ప్రక్రియను పూర్తి చేయకపోతే, భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు, భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ ఫీచర్లు, కఠిన నిబంధనలు పెరిగిన నేపథ్యంలో, వాహనం అమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కారును సురక్షితంగా, సులభంగా అమ్మడానికి ఈ 5 అంశాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

⦿ మీ డేటాను తొలగించండి

కారును అమ్మే సమయంలో దానిలోని వ్యక్తిగత డేటాను పూర్తిగా తొలగించడం చాలా అవసరం. లేటెస్ట్ కార్లు స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో మీ ఫోన్ కాంటాక్ట్స్, అడ్రెస్స్‌ లు, కాల్ హిస్టరీ లాంటి వివరాలు స్టోర్ అయ్యే  అవకాశం ఉంది. సో, వాహనం అప్పగించే ముందు, గూగుల్, ఆపిల్ కార్‌ ప్లే లావటి అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వాలి. సేవ్ చేసిన డేటాను డిలీట్ చేయాలి. ఫాస్ట్‌ ట్యాగ్‌ ను తీసివేయడం, GPS ట్రాకర్ ఉంటే తొలగించడం కూడా మర్చిపోవద్దు. కనెక్టెడ్ కార్ యాప్స్ ఉపయోగిస్తే, వాటిలో నుంచి కూడా వాహనాన్ని డిస్కనెక్ట్ చేయాలి. ఇవి మీ ప్రైవసీని కాపాడుతాయి.

⦿ సేల్ అగ్రిమెంట్

Advertisement

కారు అమ్మకంలో సేల్ అగ్రిమెంట్ అనేది అత్యంత కీలకం. తెలిసిన వ్యక్తికైనా అమ్ముతున్నా, ఒక రాతపూర్వక ఒప్పందం ఉండాలి. అందులో కారు వివరాలు, రిజిస్ట్రేషన్ నంబర్, ధర, లావాదేవీ తేదీ, కొనుగోలుదారు-అమ్మకందారు వివరాలు స్పష్టంగా ఉండాలి. ఆధార్, ఇతర గుర్తింపు వివరాలు కూడా జోడించడం మంచిది. ఈ ఒప్పందం భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు వచ్చినా రక్షణగా ఉంటుంది.

⦿ RC ట్రాన్స్ ఫర్

కొనుగోలు తర్వాత కొత్త యజమానికి RC బదిలీ చేయాలి. ఫారం 29, 30 వంటి పత్రాలు సమర్పించాలి. ఇవి యాజమాన్య మార్పును అధికారికంగా రికార్డు చేస్తాయి. స్థానిక RTO కార్యాలయంలో ఇద్దరూ హాజరై పూర్తి చేయడం మంచిది. భవిష్యత్తులో చట్టపరమైన బాధ్యతల నుంచి కాపాడుతుంది.

⦿ బకాయిల చెల్లింపు

Advertisement

కారు మీద ఉన్న అన్ని బకాయిలు ముందుగా చెల్లించాలి. ట్రాఫిక్ చలాన్లు, ఫైన్లు, ఇతర పెండింగ్ చెల్లింపులు ఉంటే,  RC ట్రాన్స్‌ ఫర్ ఆగిపోవచ్చు. మీకు, కొనుగోలుదారుకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే, ముందే వాటిని క్లియర్ చేయాలి.

⦿ PUC సర్టిఫికేట్

కారుకు చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ ఉండాలి. ఇది లేకపోతే RC బదిలీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగానే తనిఖీ చేసి, అవసరమైతే కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి.

కారు అమ్మేటప్పుడు తొందరపడకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పూర్తి చేయడం ముఖ్యం. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, భవిష్యత్తులో పెద్ద సమస్యలు నివారించవచ్చు. సరైన పద్ధతిలో అమ్మకం పూర్తి చేస్తే, మీకు కూడా నమ్మకంగా, కొనుగోలుదారుకూ సౌకర్యంగా ఉంటుంది.

Read Also: పనికిరాని కార్ యాక్సెసరీస్, వీటి కోసం అస్సలు డబ్బు వేస్ట్ చేయకండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×