E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!
Advertisement

EV Scooter Buying Guide 2026: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం రోజురోజుకు మరింత విస్తరిస్తోంది. పెట్రోల్ ధరలు  పెరగడం, రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్, బజాజ్, ఏథర్, ఓలా, విడా లాంటి పలు కంపెనీల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మోడళ్లు ఉండటంతో ఏది కొనాలి? అన్నది చాలా మందికి సందేహంగా మారుతోంది. కేవలం ఫీచర్లు, ప్రకటనలు చూసి కొనకుండా, కొన్ని ముఖ్య విషయాలు ముందుగానే పరిశీలిస్తే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయి. అవేంటంటే..

⦿ మీ ప్రయాణానికి సరిపడే రేంజ్ ఉందా?

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు ఎక్కువ మంది మొదట చూసేది రేంజ్. కంపెనీలు 150, 200 కిలోమీటర్ల రేంజ్ అని చెబుతాయి. కానీ వాస్తవంలో ట్రాఫిక్, వేడి వాతావరణం, ఇద్దరు ప్రయాణించడం లాంటి పరిస్థితుల్లో ఆ రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. రోజుకు 25 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే చిన్న బ్యాటరీ స్కూటర్ కూడా సరిపోతుంది. కానీ, ఎక్కువ దూరాలు వెళ్లేవారు, డెలివరీల కోసం వాడేవారు పెద్ద బ్యాటరీ ఉన్న మోడల్ తీసుకోవడం మంచిది.

⦿ బ్యాటరీ వారంటీ  

Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత ముఖ్యమైన భాగం బ్యాటరీ. కొనుగోలు సమయంలో బ్యాటరీ వారంటీని తప్పకుండా పరిశీలించాలి. వారంటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎంత కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది? బ్యాటరీ పనితీరు తగ్గితే కంపెనీ బాధ్యత తీసుకుంటుందా? వంటి విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా కంపెనీలు 5 నుంచి 8 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తున్నాయి. అందుకే షోరూమ్‌లో పూర్తిగా వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

⦿ ఛార్జింగ్ సౌకర్యం  

ఎలక్ట్రిక్ స్కూటర్ వాడకంలో ముఖ్యమైన విషయం ఛార్జింగ్. ఇంట్లో పార్కింగ్ స్థలం లేకపోతే, ప్లగ్ పాయింట్ అందుబాటులో లేకపోతే తర్వాత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని స్కూటర్లలో బ్యాటరీ తీసి ఇంట్లో ఛార్జ్ చేయొచ్చు. మరికొన్నింటిలో వాహనానికే నేరుగా ఛార్జర్ కనెక్ట్ చేయాలి. పూర్తి ఛార్జ్‌ కు ఎంత సమయం పడుతుంది? ఛార్జర్ ధరలో భాగమా? కాదా? లాంటి విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. రోజూ ఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంటేనే ఈవీ వాడడం మంచిది.

⦿ సర్వీస్ సెంటర్  

Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్లకు మెయింటెనెన్స్ తక్కువే అయినా పూర్తిగా అవసరం ఉండదని కాదు. టైర్లు, బ్రేకులు, సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్లు, ఛార్జింగ్ సమస్యలకు సర్వీస్ అవసరం పడుతుంది. మీ ప్రాంతానికి దగ్గరలో కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందా? స్పేర్ పార్ట్స్ త్వరగా దొరుకుతాయా? రోడ్డు మధ్యలో సమస్య వస్తే సహాయం అందిస్తారా? లాంటి విషయాలు తెలుసుకోవాలి.

⦿ ఆన్ రోడ్ ధర ఎంత?

చాలామంది ఎక్స్ షోరూమ్ ధర చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఛార్జర్, వారంటీ ప్యాకేజీలు కలిపితే ఆన్ రోడ్ ధర అవుతుంది. కొన్ని కంపెనీలు తక్కువ EMI చూపించినా, ఎక్కువ వడ్డీ, అదనపు ఖర్చులు ఉంటాయి.  అందుకే పూర్తి ఆన్ రోడ్ ధర ఎంత అవుతుంది? నెలకు ఎంత భారం పడుతుంది? అనే లెక్క ముందే వేసుకోవాలి.

Read Also: ఈవీ బైకులకు ట్రాఫిక్ రూల్స్ వర్తించవా? ఎలా వెళ్లినా పర్వాలేదా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×