E-Paper
Advertisement

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!
Advertisement

Best Bikes for Bad Roads: దేశంలోని చాలా రోడ్లు ఇప్పటికీ గుంతల మయంగానే ఉన్నాయి. రఫ్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, ఎత్తుపల్లాలు లాంటి సమస్యలు రోజువారీ ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మారుస్తుంటాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు బైక్‌పై ప్రయాణించే వారికి నడుము నొప్పి, అలసట లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, మార్కెట్లో కొన్ని కమ్యూటర్ మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి. ఇవి స్మూత్ సస్పెన్షన్, సౌకర్యవంతమైన సీట్ల లాంటి ఫీచర్లతో మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అలాంటి ఐదు బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌ లలో హీరో స్ప్లెండర్ ఒకటి. దీని XTEC వెర్షన్ సౌకర్యవంతమైన ప్రయాణానికి మరింత ప్రాధాన్యం ఇస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉండటం వల్ల గుంతల్లో నుంచి వెళ్లినా ఇబ్బంది కలిగించదు. ఈ బైక్ బరువు కూడా తక్కువగా ఉండటంతో నగరంలో రోజువారీ వినియోగానికి బాగా సరిపోతుంది. ఇందులో 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండగా, ఇది 8 bhp శక్తి, 8.05 Nm టార్క్‌ ను అందిస్తుంది.

2.హోండా షైన్ 125

Advertisement

125 సీసీ సెగ్మెంట్‌ లో సౌకర్యవంతమైన బైక్‌ లలో హోండా షైన్‌ కు ప్రత్యేక స్థానం ఉంది. దీని సస్పెన్షన్ సెటప్ స్మూత్ రైడ్‌ను అందిస్తుంది. బ్యాడ్ రోడ్లపై కూడా ప్రయాణికులకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా రూపొందించారు. పొడవైన, మెత్తటి సీటు కారణంగా రైడర్‌ తో పాటు వెనుక కూర్చునే వ్యక్తికి కూడా మంచి సౌకర్యం లభిస్తుంది. ఇందులో 123.94 సీసీ ఇంజిన్ ఉండగా, ఇది 10.6 bhp పవర్, 11 Nm టార్క్‌ ను అందిస్తుంది.

3.TVS రాడియాన్

TVS  రాడియాన్ ఎక్కువ మందికి పరిచయం లేకపోయినా, రైడ్ క్వాలిటీ పరంగా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ బైక్‌లో సస్పెన్షన్ సెటప్ పూర్తిగా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. గుంతలు ఉన్న రోడ్లపై ప్రయాణించినప్పుడు కూడా రైడర్‌ కు తక్కువ ఒత్తిడి కలిగేలా ఈ బైక్ పనిచేస్తుంది. ఇందులో 109.7 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8.08 bhp శక్తి, 8.7 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

4.బజాజ్ ఫ్రీడమ్ 125 CNG

Advertisement

ప్రపంచంలోనే తొలి CNG మోటార్‌ సైకిల్‌ గా బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండు ఫ్యూల్ ట్యాంకులు ఉన్నప్పటికీ ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. పొడవైన వీల్‌ బేస్, స్మూత్ సస్పెన్షన్ కారణంగా గుంతల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. సీటింగ్ పొజిషన్ ఎక్కువసేపు ప్రయాణించినా అలసటను తగ్గిస్తుంది. 125 సీసీ ఇంజిన్ CNG, పెట్రోల్ రెండింటిపైనా పని చేస్తుంది. ఇది 9.5 bhp పవర్, 9.7 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

5.హోండా SP125

స్పోర్టీ లుక్‌ తో పాటు మంచి సౌకర్యాన్ని అందించే బైక్‌లలో హోండా SP125 ఒకటి. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ షాక్ అబ్జార్బర్లు మంచి పనితీరును అందిస్తాయి.  రోజువారీ ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలకు కూడా ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది. సీటు కుషనింగ్ కూడా బాగుంటుంది. ఇందులో 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 10.6 bhp పవర్, 10.9 Nm టార్క్‌ ను అందిస్తుంది.

Read Also: ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×