E-Paper
Advertisement

కారు మెయింటెనెన్స్ లో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే, మీ కారు ఔట్!

కారు మెయింటెనెన్స్ లో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే, మీ కారు ఔట్!
Advertisement

Car Maintenance Tips: ఈ రోజుల్లో చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనడం ముఖ్యంగా కాదు, దానిని సరిగి మెయింటెనెన్స్ చేయడం ముఖ్యం. ఎందుకంటే స్పేర్ పార్ట్స్, ఫ్యూయెల్, సర్వీసింగ్ ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చాలా మంది కారు యజమానులు చిన్న చిన్న మెయింటెనెన్స్ విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ చిన్న తప్పులే కొన్నేళ్లలో పెద్ద సమస్యలుగా మారి, కారు పనితీరు, మైలేజ్, రీసేల్ వ్యాల్యూ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా లేటస్ట్ కార్లు సరిగా పనిచేయాలంటే ఇంజిన్, బ్రేకులు,  ఎలక్ట్రికల్ సిస్టమ్ ను తరచుగా చెక్ చేయాలి.

⦿ ఇంజిన్ ఆయిల్ ఛేంజ్

చాలా మంది చేసే పొరపాటు ఇంజిన్ ఆయిల్ ఛేంజ్ ను సరిగి పట్టించుకోకపోవడం. దేశంలో వేడి, దుమ్ము, ట్రాఫిక్ కారణంగా ఆయిల్ త్వరగా చెడిపోతుంది. సమయానికి ఆయిల్ మార్చకపోతే ఇంజిన్ లోపల ఘర్షణ పెరిగి, భాగాలు వేగంగా అరిగిపోతాయి. పాత ఆయిల్‌ లో మలినాలు ఏర్పడి, ఇంజిన్ పనితీరును దెబ్బతీస్తాయి. కారు ఎక్కువగా వాడకపోయినా ఆయిల్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో, సమయానికి ఆయిల్ ఛేంజ్ చేయాలి.

⦿ టైర్ ప్రెషర్

Advertisement

ఇంకో కామన్ మిస్టేక్ టైర్ ప్రెషర్, రొటేషన్‌ ను పట్టించుకోకపోవడం. టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరుగుతుంది. టైర్లు త్వరగా అరిగిపోతాయి. ఎక్కువ గాలి ఉన్నా కూడా బ్రేకింగ్, రోడ్ గ్రిప్ తగ్గుతుంది. అలాగే టైర్ రొటేషన్ చేయకపోతే ముందు టైర్లు ఎక్కువగా అరిగిపోతాయి. అందుకే నెలకు కనీసం ఒకసారి టైర్ ప్రెషర్ చెక్ చేయడం మంచిది.

⦿ బ్రేక్ సిస్టమ్‌ను నిర్లక్ష్యం

బ్రేక్ సిస్టమ్‌ను నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదకరం. బ్రేక్ ప్యాడ్లు క్రమంగా అరిగిపోతాయి. వాటిని సమయానికి మార్చకపోతే డిస్క్‌ లు కూడా చెడిపోతాయి. బ్రేక్ ఫ్లూయిడ్ తేమను పీల్చుకుని పని తీరును తగ్గిస్తుంది. ట్రాఫిక్‌ లో ఎక్కువగా బ్రేకులు వేయడం వల్ల ఈ సమస్యలు మరింత వేగంగా వస్తాయి.

⦿ బ్యాటరీ చెకింగ్

Advertisement

బ్యాటరీని కూడా చాలామంది పట్టించుకోరు. అధిక వేడి, చిన్న ప్రయాణాలు బ్యాటరీ జీవితాన్ని తగ్గిస్తాయి. బ్యాటరీ సరిగా లేనప్పుడు కారు సరిగా స్టార్ట్ కాదు. ఎలక్ట్రికల్ సమస్యలు వస్తాయి. రెగ్యులర్ సర్వీసింగ్ సమయంలో బ్యాటరీని చెక్ చేయించుకోవడం చాలా అవసరం.

⦿ ఎయిర్, క్యాబిన్ ఫిల్టర్లను మార్పిడి

చివరగా ఎయిర్, క్యాబిన్ ఫిల్టర్లను మార్చకపోవడం. దుమ్ముతో ఫిల్టర్లు మూసుకుపోతే ఇంజిన్‌లోకి గాలి సరైన రీతిలో వెళ్లదు. ఫ్యూయెల్ వినియోగం పెరుగుతుంది. ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. క్యాబిన్ ఫిల్టర్ మూసుకుపోతే ఎసీ పనితీరు తగ్గి, లోపల ఎయిర్ క్వాలిటీ కూడా పడిపోతుంది. ఇవి చవకైన భాగాలే కాబట్టి సమయానికి మార్చడం మంచిది.

చిన్న చిన్న మెయింటెనెన్స్ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే, కారు ఎక్కువకాలం మంచి పనితీరుతో ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల అనవసర ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Read Also: ఆటోమేటిక్ కారు కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×