E-Paper
Advertisement

Unnecessary Car Accessories: పనికిరాని కార్ యాక్సెసరీస్, వీటి కోసం అస్సలు డబ్బు వేస్ట్ చేయకండి!

Unnecessary Car Accessories: పనికిరాని కార్ యాక్సెసరీస్, వీటి కోసం అస్సలు డబ్బు వేస్ట్ చేయకండి!
Advertisement

5 Useless Car Accessories: కారు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని మరింత అందంగా, సౌకర్యవంతంగా మార్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే మార్కెట్‌ లో లభించే ఆఫ్టర్‌ మార్కెట్ యాక్సెసరీలను కొనాలనే ఆలోచన వస్తుంది. కానీ, అందులో ప్రతి యాక్సెసరీ ఉపయోగకరమే అనుకోవడం తప్పు. కొన్ని వస్తువులు కేవలం ఆకర్షణ కోసం మాత్రమే ఉంటాయి. ఉపయోగం తక్కువగా ఉంటుంది. పైగా అదనపు ఖర్చును పెంచుతాయి. నిజానికి కారు అనేది నెమ్మదిగా విలువ తగ్గే ఆస్తి. కొత్త కారు కొనుగోలు చేసిన, మొదటి ఏడాదిలోనే దాని విలువ భారీగా తగ్గుతుంది. తర్వాత కూడా వాడకం, పాతబడటం లాంటి కారణాలతో వ్యాల్యూ తగ్గుతూనే ఉంటుంది. అందుకే అవసరం లేని యాక్సెసరీలపై డబ్బు ఖర్చు చేయడం కన్నా, అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ నేపథ్యంలో కొనకుండా ఉండాల్సిన కొన్ని యాక్సెసరీల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ స్లిప్ ఆన్ స్టీరింగ్ వీల్ కవర్లు

స్లిప్ ఆన్ స్టీరింగ్ వీల్ కవర్లు పట్టును మెరుగుపరుస్తాయి. చాలా సందర్భాల్లో తక్కువ నాణ్యత  కలిగినవి సరిగా ఫిక్స్ కావడం లేదు. ఫలితంగా స్టీరింగ్‌ పై పట్టు తగ్గి, డ్రైవింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

⦿ ఫ్యాన్సీ సీట్ కవర్లు

Advertisement

చాలా కార్లు ఇప్పటికే మంచి సీట్లతో వస్తాయి. పైగా ఖరీదైన సీట్ కవర్లు వేసుకున్నా, నిజంగా కంఫర్ట్ పెరగడం చాలా తక్కువ. ఇవి కేవలం కారు లోపలి లుక్ మార్చడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

⦿ ఆఫ్టర్‌ మార్కెట్ TPMS పరికరాలు

టైర్ల ఎయిర్ ప్రెషర్ ను చూపిస్తాయని చెప్పే ఈ పరికరాలు ఎక్కువగా చవకైనవి. వాటి డేటా నమ్మదగినదిగా ఉండకపోవచ్చు. తప్పు సమాచారం వల్ల డ్రైవర్ తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది.

⦿ రూఫ్ క్యారియర్లు

Advertisement

వీటిని తరచుగా వాడని వారు కూడా ఫ్యాషన్ కోసం అమర్చుకుంటారు. కానీ, ఇవి కారుపై అదనపు బరువు పెంచి, ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. అలాగే, గాలి శబ్దం పెరగడం, నిర్మాణ భద్రతపై ప్రభావం చూపడం లాంటి సమస్యలు వస్తాయి.

⦿ యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్స్

LED యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్స్  కారు లోపలి అందాన్ని పెంచినా, భద్రత, పనితీరుకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా, ఎక్కువగా వాడితే బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది.

Read Also: కారు ఇండికేటర్ వేసినప్పుడు ‘టిక్ టిక్’ సౌండ్ వస్తుంది, ఎందుకో తెలుసా?

సో, కారు యాక్సెసరీలు కొనేటప్పుడు ఆకర్షణ కంటే అవసరాన్ని ముందుగా ఆలోచించడం ముఖ్యం. ఉపయోగం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా, భద్రత, సౌకర్యం పెంచే వాటినే ఎంచుకోవడం మంచిది. దీంతో మీ ఖర్చు తగ్గడమే కాకుండా, కారు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

Read Also: ఇవి స్కూటర్లు కాదు, కదిలే కళాఖండాలు.. జపాన్‌లో నయా ట్రెండ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×