// // Flights Cancelled: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు.. హైదరాబాద్ నుంచి 35 ఇంటర్నేషనల్ ప్లైట్స్ క్యాన్సిల్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Flights Cancelled: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు.. హైదరాబాద్ నుంచి 35 ఇంటర్నేషనల్ ప్లైట్స్ క్యాన్సిల్!

Flights Cancelled: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు.. హైదరాబాద్ నుంచి 35 ఇంటర్నేషనల్ ప్లైట్స్ క్యాన్సిల్!
Advertisement

35 International Flights Cancelled: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియా ప్రాంతం  అల్లకల్లోలంగా మారింది. గల్ఫ్ కంట్రీస్ లో గత ఐదు రోజులుగా తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాలకు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. విమానయాన సంస్థలు ప్లైట్స్ క్యాన్సిల్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి 35 విమానాలు రద్దు

ఇవాళ(మార్చి 5న) శంషాబాద్ విమానాశ్రయం నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన 35 విమానాలు రద్దు అయినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 19 అంతర్జాతీయ విమానాలు ఎయిర్ పోర్టుకు రావాల్సి ఉండగా, 16 విమానాలు ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉన్నట్లు తెలిపారు. అయితే, కొన్ని ప్రత్యేక విమానాలు పశ్చిమాసియా నుంచి ఈ విమానాశ్రయానికి వచ్చాయి.

ప్రయాణీకుల తీవ్ర అవస్థలు 

Advertisement

అటు మిడిల్ ఈస్ట్ ప్రయాణాలకు సంబంధించి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ లో చిక్కుకున్న వాళ్లు ఇక్కడికి రాలేక, ఇక్కడ ఉన్న వాళ్లు అక్కడికి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. అసలు విమానాలు ఎప్పుడు వస్తాయో? ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో? తెలియని పరిస్థితిలో ఉన్నారు. విమాన సంస్థలు సైతం ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రయాణీకులు, సిబ్బందికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే, విమానాలు నడపమని వెల్లడించాయి.

ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసిన ఇండిగో

ఇండిగో తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. “గత కొన్ని రోజులుగా, మా ప్రయాణీకులలో చాలా మంది ఇంటికి తిరిగి రావడానికి లేదంటే అత్యంత ముఖ్యమైన ప్రదేశాలకు చేరుకోవడానికి వేచి ఉన్నారు. ఈ సమయంలో వారిని సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లకగకుండా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా, భద్రతకు పెద్దపీట వేస్తూ, ప్రయాణాలకు సపోర్టు ఇస్తున్నాం. అవకాశం ఉన్నప్పుడల్లా విమాన సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నాం. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం” అని తెలిపింది.

Advertisement

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం.. చుక్కలు చూపిస్తున్న విమాన టికెట్ ధరలు!

ఏథెన్స్, మస్కట్, జెడ్డా, మదీనాకు ముందుగా ప్రకటించిన విమానాలు, యుఎఇకి ఎంపిక చేసిన విమానలు, ప్రభావిత మార్గాల్లో కనెక్టివిటీ క్రమంగా పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. “మా ప్రయాణీకులు, సిబ్బంది భద్రత మా అత్యంత ప్రాధాన్యతా అంశం. మాకు అనుమతులు ఉంటే, ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు మరింత మద్దతు ఇవ్వడానికి యుఎఇకి తిరిగి పంపే విమానాల ఫ్రీక్వెన్సీని పెంచడానికి మేము ప్రయత్నిస్తాము” అని వివరించింది.  అయితే, అక్కడి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి.

Read Also: కోవిడ్-19 To ఇరాన్ వార్.. 2020 నుంచి ప్రపంచ ఎదుర్కొన్న అతిపెద్ద విమాన ప్రయాణ సంక్షోభాలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×