E-Paper
Advertisement

Upcoming Maruti Suzuki Cars: దేశీ మార్కెట్ లోకి 3 మారుతి సుజుకి కార్లు, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Upcoming Maruti Suzuki Cars: దేశీ మార్కెట్ లోకి 3 మారుతి సుజుకి కార్లు, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

Upcoming Maruti Suzuki Models in India: మారుతి సుజుకి 2026, 2027 నాటికి కొత్త విభాగాలలోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తృతం చేయబోతోంది. రాబోయే శ్రేణిలో పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ MPV, ఫ్లెక్స్ ఫ్యూయల్ కు సపోర్ట్ చేసే సరికొత్త ఫ్రాంక్స్ అందుబాటులోకి రాబోతోంది. పాపులర్ కాంపాక్ట్ SUVలలో ఒకదానికి మిడ్ సైకిల్ అప్ డేట్ ఉంటుందని తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో మారుతి సుజుకి నుంచి రాబోయే మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ అప్ డేటెడ్ మారుతి సుజుకి ఫ్రాంక్స్

భారత్ లో కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ పవర్‌ ట్రెయిన్‌ కు అనుకూలంగా ఫ్రాంక్స్ అందుబాటులోకి రానుంది. ఇది ఇండియన్ మార్కెట్ లో ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి క్రాస్ ఓవర్‌ మోడల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో మాదిరిగా లెవల్ 2 ADAS సూట్‌ ను కూడా అందించవచ్చని భావిస్తున్నారు.  ఆగ్నేయాసియా వెర్షన్ల కోసం ప్రస్తుతం రిజర్వు చేయబడిన అనేక ప్రీమియం టెక్నాలజీలు, పరికరాల ఎంపికలు ఇండియా మోడల్ కు ఉండబోతన్నట్లు తెలస్తోంది.

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

Advertisement

ఇండియన్ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కారు, సరికొత్తగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో వినియోగదారుల ముందుకు రాబోతోంది. అప్ కమింగ్ కారు క్యాబిన్ లోపల కీలక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. రిఫ్రెష్ చేయబడిన మోడల్ అదనపు ఫీచర్లతో పాటు పెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ టచ్‌ స్క్రీన్‌ ను పొందే అవకాశం ఉంది. టెక్నాలజీపై కస్టమర్ అంచనాలు పెరుగుతూ ఉన్నందున ఇంటీరియర్ మార్పులు SUV పోటీగా ఉండటానికి సహాయపడతాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఇక కారు బయటి భాగానికి వస్తే,  చిన్న చిన్న మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. బహుశా చిన్న స్టైలింగ్ ట్వీక్‌లు, అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. CNG వేరియంట్‌ లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: బెంజ్ కార్లలో ఇంత పెద్ద తప్పా? ఏకంగా 3 మోడల్స్ రీకాల్!

⦿ మారుతి సుజుకి YMC

Advertisement

ఇక ఈ మోడల్ e విటారా మాదిరిగానే అదే ఆర్కిటెక్చర్, బ్యాటరీ కాన్ఫిగరేషన్ల ఆధారంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ MPV  అంతర్గతంగా YMC అనే కోడ్‌ నేమ్ తో పిలుస్తున్నారు. మారుతి సుజుకి EV శ్రేణిని బలోపేతం చేయడంలో ఈ కారు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. స్టైలింగ్ విషయాలకు సంబంధించి e విటారా నుంచి ప్రేరణ పొందే అవకాశం ఉన్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.  త్వరలోనే ఈ మోడల్స్ కు సంబంధించి మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: సన్‌ రూఫ్‌ కారు కొనాలనుకుంటున్నారా? చౌకైన మోడల్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×