// //
Mercedes-Benz India Recalls 149 Cars: జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెస్-బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ సిస్టమ్‌లో సాఫ్ట్ వేర్ గ్లిచ్‌ను సరిచేయడానికి మూడు మోడల్స్ కు సంబంధించి 149 లగ్జరీ వాహనాలను రీకాల్ చేసింది. ఈ మేరకు కంపెనీ కీలక ప్రకటన చేసింది.
స్టీరింగ్ ఇన్ పుట్, డ్రైవర్ ఎంగేజ్‌మెంట్ లేకపోవడాన్ని గుర్తిస్తే కారును ఆటోమేటిక్ గా ఆగిపోవడంతో పాటు ఎమర్జెన్సీ కాల్ చేయడం ద్వారా వైద్య అత్యవసర పరిస్థితులలో జోక్యం చేసుకోవడానికి ప్రత్యేక భద్రతా ఫీచర్ రూపొందించబడింది. అయితే, కొన్ని మోడళ్లలో ఈ ఫీచర్ సిస్టమ్ యాక్టివేట్ కావడం లేదని కంపెనీ గుర్తించింది. డ్రైవర్లు వాహనాన్ని నియంత్రించలేనప్పుడు కీలకమైన ఆటోమేటెడ్ సహాయం లేకుండా పోయే అవకాశం ఉందని జర్మన్ ఆటోమేకర్ కనుగొంది. ఈ సమస్యను సరిచేసేందుకు రీకాల్ ప్రకటించింది.
ఇక తాజాగా కంపెనీ ప్రకటించిన రీకాల్ ఎఫెక్ట్ CLE, AMG CLE, AMG C-క్లాస్ మోడళ్లపై ఉంటుంది. సెప్టెంబర్ 2024 ప్రారంభం నుంచి మార్చి 2025 మధ్యకాలం మధ్య నిర్మించిన CLE యూనిట్లు ప్రభావితం కానున్నాయి. 2024 చివరి నుంచి మార్చి 2025 వరకు నిర్మించిన AMG CLE మోడల్స్, అక్టోబర్ 2024 చివరిలో ప్రారంభమై నెల వ్యవధిలో తయారు చేయబడిన AMG C-క్లాస్ వాహనాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు కంపెనీ గుర్తించింది.
మూడు మోడల్స్ కు చెందిన కార్లలో ఈ సమస్య తలెత్తిన నేపథ్యంలో ఆయా వాహనాల యజమానులు సాఫ్ట్ వేర్ సమస్యను పరిష్కరించడానికి వారికి దగ్గర లోని సర్వీస్ సెంటర్స్ కు వెళ్లాలని కంపెనీ సూచించింది. ఈలోగా వాహన ప్రవర్తనకు డ్రైవర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైన మరమ్మతులు పూర్తయ్యే వరకు ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ మీద ఆధారపడకుండా ఉండాలని కంపెనీ సిఫార్సు చేసింది.
జర్మన్ ఆటోమేకర్ ఏప్రిల్ 2026లో దేశీ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ CLAను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. CLA ఎలక్ట్రిక్ ఈ సంవత్సరం మెర్సిడెస్ బెంజ్ ఇండియా 12 మోడళ్ల ప్రణాళికలో భాగం అవుతుంది. లాంచ్ ప్రోగ్రామ్ ఇప్పటికే జరుగుతోంది.
అటు ఇప్పటికే జనవరిలో, కంపెనీ స్థానికంగా అసెంబుల్ చేసిన మేబ్యాక్ GLSని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 2.75 కోట్లు (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. మెర్సిడెస్ మేబ్యాక్ GLS లాంచ్ తర్వాత అప్ డేట్ చేసిన 2026 ఎలక్ట్రిక్ లగ్జరీ సెలూన్ EQS ను తీసుకురాబోతోంది. దీని ధర రూ. 1.34 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా, మెర్సిడెస్ బెంజ్ తన రాబోయే లాంచ్‌లలో ప్రస్తుత భారతీయ లైనప్‌లో కొత్త తరం ఉత్పత్తులు, మోడళ్లు రెండూ ఉంటాయని ప్రకటించింది. CLA ఎలక్ట్రిక్ నెక్ట్స్ జెనరేషన్ CLA నేమ్ ప్లేట్ ను ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ తో భారత్ కు తీసుకొస్తుంది.
Read Also: సన్ రూఫ్ కారు కొనాలనుకుంటున్నారా? చౌకైన మోడల్స్ ఇవే!