E-Paper
Advertisement

కొత్త టాటా టియాగో కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

కొత్త టాటా టియాగో కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

Tata Tiago 2026 Review: టాటా మోటార్స్ 2026 టియాగో హ్యాచ్‌ బ్యాక్‌ ను కొత్తగా అప్ డేట్ చేసింది. నయా డిజైన్, మెరుగైన ఇంటీరియర్, అదనపు ఫీచర్లతో ఈ కారు మరింత స్టైలిష్ గా మారింది. పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభించే ఈ హ్యాచ్‌ బ్యాక్ నగర ప్రయాణాలకు అనువైన కారుగా గుర్తింపు పొందింది. అయితే, ఈ కారులో కొన్ని ప్లస్ పాయింట్స్ తో పాటు మరికొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టియాగో 2026 ఎందుకు కొనాలి?

టియాగోను కొనుగోలు చేయడానికి ఉన్న ప్రధాన కారణాల్లో మొదటిది క్యాబిన్. కొత్త డాష్‌ బోర్డ్ డిజైన్, లైట్ గ్రే ఇంటీరియర్ థీమ్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ తో కారు లోపలి భాగం మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టోరేజ్ స్పేస్‌ ను కూడా మెరుగుపరిచారు. వెనుక ఏసీ వెంట్స్, సెంటర్ ఆర్మ్‌ రెస్ట్, ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్టు ఇచ్చే USB-C పోర్ట్ లాంటి ఫీచర్లు రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

Advertisement

అటు ఫీచర్ల పరంగా కూడా టియాగో మంచి ప్యాకేజీని అందిస్తోంది. టాప్ వేరియంట్లలో 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ లాంటి ఆధునిక సదుపాయాలు లభిస్తున్నాయి.

ఈ కారు డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. కాంపాక్ట్ సైజు, తేలికైన స్టీరింగ్, మంచి విజిబిలిటీతో నగర ట్రాఫిక్‌ లో ఈ కారును నడపడం చాలా ఈజీగా ఉంటుంది. ఇరుకైన వీధులు, పార్కింగ్ ప్రదేశాల్లో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. రైడ్ క్వాలిటీ కూడా బాగుండటంతో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో పాటు AMT వెర్షన్ కూడా వినియోగదారులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

టియాగో 2026లో మైనస్ పాయింట్స్ ఇవే!   

Advertisement

అయితే టియాగోలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఇంజిన్ రిఫైన్‌ మెంట్. 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ పనితీరు పరంగా సరిపోతున్నప్పటికీ, ప్రత్యర్థి కార్లతో పోలిస్తే అంత స్మూత్‌ గా అనిపించదు. ముఖ్యంగా కారు ఐడిల్‌ లో ఉన్నప్పుడు వైబ్రేషన్లు వస్తాయి. అలాగే వేగం పెరిగేకొద్దీ ఇంజిన్‌  ప్రత్యేకమైన శబ్దం కూడా వినిపిస్తుంది. అంతేకాదు, కొన్ని అవసరమైన ఫీచర్లు లేకపోవడం కూడా మరో మైనస్. కొత్త అప్‌ డేట్‌ లో ఆరు ఎయిర్‌ బ్యాగులు, ESP వంటి భద్రతా ఫీచర్లు ఇచ్చినప్పటికీ, వెనుక సీటులో అడ్జస్టబుల్ హెడ్‌ రెస్టులు లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. అలాగే రియర్ సీట్ లోడ్ సెల్ సెన్సర్లు కూడా అందుబాటులో లేవు.

Read Also: ఇక నో రీసేల్ టెన్షన్‌.. బై బ్యాక్ గ్యారెంటీతో లభిస్తున్న 8 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×